పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(Pakistan Cricket Board).. మరోసారి తీవ్ర విమర్శలపాలైంది. అంతర్జాతీయంగా మళ్లీ నవ్వులపాలైంది. రీసెంట్ గా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy)నిర్వహణ విషయంలో.. భారత క్రికెట్ బోర్డును ఇబ్బందిపెట్టబోయి నవ్వులపాలైన పీసీబీ.. ఈ సారి సొంత దేశంలోనే చేసిన నిర్వాకంతో పరువు పోగొట్టుకుంది. అసలు విషయానికి వస్తే.. మన దగ్గర జరిగే ఐపీఎల్ మాదిరిగానే.. పాక్ లో కూడా ఓ లీగ్ నడుస్తోంది. పేరు.. పాకిస్తాన్ సూపర్ లీగ్. అంతర్జాతీయ క్రికెటర్లు చాలా మంది ఇందులో ఆడుతున్నారు. బాగానే డబ్బులు సంపాదిస్తున్నారు. కానీ.. టోర్నీని నిర్వహించే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాత్రం.. మరీ పీనాసితనానికి పోయి తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ కు గురవుతోంది.
ముల్తాన్ సుల్తాన్స్ జట్టుతో (Multan Sultans team) కరాచీ కింగ్స్ జట్టు (Karachi Kings team) తలపడిన సందర్బంగా ఈ ఘటన జరిగింది. ఇంగ్లండ్ కు చెందిన జేమ్స్ విన్స్ (James Vince).. కరాచీ కింగ్స్ తరఫున ఆడుతున్నాడు. 42 బాల్స్ లోనే సెంచరీ చేసి.. తన జట్టుకు ఘన విజయాన్ని అందించడమే కాదు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును కూడా అందుకున్నారు. ఇక్కడే.. ఓ విచిత్రం జరిగింది. జేమ్స్ విన్స్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గిఫ్ట్ కింద.. ఓ హెయిర్ డ్రయర్ ను పీసీబీ బహుమానంగా అందించింది. ఇది తీసుకునేందుకు జేమ్స్.. ఎంతగానో ఇబ్బంది పడిన విషయం.. క్లియర్ గా కనిపించింది. చిన్న చిన్న లీగ్స్ లో కూడా వేలాది రూపాయల గిఫ్ట్ లను ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ లకు అందిస్తుండగా.. పీసీబీ మాత్రం ఇలా ఎందుకు చేసిందన్నది జేమ్స్ తో పాటు అందరికీ అర్థం కాకుండా మారింది.
పాకిస్తాన్ సూపర్ లీగ్ పేరుతో ఘనంగా టోర్నమెంట్ నిర్వహిస్తున్న పీసీబీ.. ఇలాంటి చిన్న విషయాలను పట్టించుకోని తీరుతో.. నిజంగానే పరువు పోగొట్టుకుంటోంది. ఇక్కడ హెయిర్ డ్రయర్ ను అవమానించినట్టు కాదని.. తక్కువ ధరకు లభించే వస్తువులను కానుకలుగా ఇచ్చిన పీసీబీ తీరు.. మరీ పీనాసితనంగా కనిపిస్తోందని చాలా మంది ఓపెన్ గా సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. అది కూడా.. గిఫ్ట్ ఇస్తున్నప్పుడు ఫొటోల కోసం చూపిన ఉత్సాహం.. పబ్లిసిటీపై కనబరిచిన ఉత్సాహం అయితే.. వేరే లెవల్ అని కూడా విసుక్కుంటున్నారు. ఈ లీగ్ లో ఆడుతున్న అంతర్జాతీయ క్రికెటర్లు కూడా.. అనవసరంగా వచ్చాంరా బాబూ.. అని నిరుత్సాహానికి గురవుతున్నట్టుగా కూడా వార్తలొస్తున్నాయి.
ఈ విషయంపై పాక్ క్రికెట్ బోర్డు మాత్రం సరైన రీతిలో స్పందించడం లేదు. లీగ్ నిర్వహణతో సంపాదిస్తున్న డబ్బులు ఏమవుతున్నాయని పాక్ క్రికెట్ అభిమానులు విసురుతున్న ప్రశ్నలకు పీసీబీ దగ్గర సమాధానమే లేదు. ఈ విషయంలో..