కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్(Shekhar Master).. ఎమోషనల్ అయ్యాడు. తను కంపోజ్ చేసిన పాటల్లోని స్టెప్పులు బూతులకు కేరాఫ్ గా ఉన్నాయంటూ విపరీతంగా జరిగిన ట్రోలింగ్ పై రియాక్ట్ అవుతూ.. కంటతడి పెట్టుకున్నాడు. ఓ నెల నుంచి.. ప్రముఖ టీవీ చానల్ లో వీకెండ్ ఎంటర్ టైన్ మెంట్ షోకు శేఖర్ మాస్టర్ జడ్జ్ గా చేస్తున్నాడు. అందులో.. కొందరు డాన్సర్లు స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చారు. శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన పాటలకు డ్యాన్సులు చేశారు. ఆ సందర్భంగా.. అది దా సర్ ప్రైజూ పాట గురించి హోస్ట్ శ్రీముఖి.. శేఖర్ మాస్టర్ తో మాట్లాడింది. ఆ పాటలకు మాస్టర్ కు ఎంతో మంచి పేరు వచ్చిందని చెబుతూనే.. ట్రోలింగ్ జరిగిన తీరును ప్రస్తావించింది. దీనిపై శేఖర్ మాస్టర్ రెస్పాన్స్ ను కోరింది.
ఆ వెంటనే.. తీవ్ర ఆవేదనకు గురైన శేఖర్ మాస్టర్.. తన కంపోజింగ్ స్టైల్ గురించి వివరించాడు. ఏ పాటకైనా ఏ థీమ్ ఉంటుందని.. పాటలో ఉండే ఫ్లేవర్ ప్రకారమే స్టెప్పులు కంపోజ్ చేస్తామని చెప్పాడు. వాటిని హీరో, హీరోయిన్లకు.. దర్శకుడికి.. నిర్మాతకు చూపిస్తామని అన్నాడు. నాలుగైదు రకాలుగా స్టెప్పులు కంపోజ్ చేస్తామని వివరించాడు. వాటిల్లోంచి అందరూ ఓకే చేసిన వాటిని మాత్రమే ఫైనల్ గా కన్ఫమ్ చేస్తామని చెప్పాడు. ఈ విషయం ఎవరికీ తెలియదని.. ఏదీ తెలుసుకోకుండానే కొందరు ఇష్టం వచ్చినట్టు రాసేస్తుంటారని శేఖర్ మాస్టర్ ఎంతో ఆవేదనకు గురయ్యాడు. తనకూ ఓ కుటుంబం ఉంటుందని.. వారి ఆవేదన గురించి ఎవరూ పట్టించుకోరని చెబుతూ.. కంటతడి పెట్టుకున్నాడు.
శేఖర్ మాస్టర్ ఆవేదన చూసిన అక్కడున్న వాళ్లంతా ఎమోషనల్ గా ఫీలయ్యారు. ఎవరేమనుకున్నా సరే.. మాస్టర్ టాలెంటెడ్ అనీ.. కష్టపడి పైకి వచ్చిన ఆయన అంటే అందరికీ ఎంతో గౌరవమని చెబుతూ.. లవ్ యూ శేఖర్ మాస్టర్ అని చెప్పి.. అంతా చీర్ చేశారు. ఈ విషయం.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శేఖర్ మాస్టర్ చెప్పినదాంట్లోనూ వాస్తవం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే.. కళాకారుడు అన్నాక ఏదో ఒక దశలో విమర్శలు రావడం.. ట్రోలింగ్ కు గురి కావడం సహజం అని మరి కొందరు చెబుతున్నారు. వాటిని గుర్తు పెట్టుకుని.. రానున్న రోజుల్లో అలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత శేఖర్ మాస్టర్ దే అని అంటున్నారు.
ట్రోలింగ్ పై బాధపడడం కాకుండా.. ఎవర్ని వారు అప్రమత్తం చేసుకోవడానికి ఉపయోగపడుతుందన్న వాస్తవాన్ని కూడా మాస్టర్ గుర్తిస్తే మంచిదని.. సలహా ఇస్తున్నారు.