నటి రేణూ దేశాయ్ (Actress Renu Desai).. ఏం మాట్లాడినా సంచలనం అవుతోంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Power Star Pawan Kalyan) నుంచి విడాకులు తీసుకున్న తర్వాత.. పూర్తిగా పిల్లల కోసమే పరిమితం అవుతున్న రేణూ.. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో కూడా ఇదే విషయంపై స్పందించింది. రెండో పెళ్లిపై కూడా తన అభిప్రాయాన్ని కుండబద్ధలు కొట్టింది. ప్రస్తుతం తన కూతురు ఆద్యాకు (Aadhya) 15 ఏళ్ల వయసు మాత్రమే అని.. ఆమెకు 18 ఏళ్లు దాటిన తర్వాత.. ఆద్య తన పని తాను పూర్తిగా చేసుకునే సామర్థ్యం వచ్చాక.. తన పర్సనల్ లైఫ్ గురించి ఆలోచిస్తానని.. అప్పుడే రెండో పెళ్లిపై నిర్ణయం తీసుకుంటానని చెప్పింది. ఈ ఒక్క విషయం మాత్రమే కాదు.. మహిళల భద్రత, ఆర్థిక అభివృద్ధి.. ఎడ్యుకేషన్.. టాక్స్ సిస్టమ్.. ఇలా చాలా అంశాలపై విలేకరి అడిగిన ప్రశ్నలకు ఓ సిటిజన్ గా తన అభిప్రాయాలను స్పష్టంగా పంచుకుంది రేణూ. అయితే.. ఈ మొత్తం వ్యవహారంలో.. కేవలం రెండో పెళ్లి గురించిన టాపిక్కే హైలైట్ అయ్యింది. ఇదే.. రేణూకు కోపం తెప్పించింది.
తాను ఇంటర్వ్యూలో చాలా విషయాలపై మాట్లాడితే.. వేరే ఏదీ వినిపించనట్టు.. రెండో పెళ్లి గురించే ఎందుకు మీడియా దృష్టి పెడుతోందంటూ రేణూదేశాయ్ సీరియస్ అయ్యింది. ఇది పూర్తిగా తన వ్యక్తిగతమైన విషయమని.. తన కుటుంబానికి చెందిన విషయమని.. ఆమె ఎమోషన్ అయ్యింది. ఈ విషయాలతో సొసైటీకి ఎలాంటి లాభం లేదని స్పష్టం చేసిన రేణూ దేశాయ్.. అసలు ఎందుకింత హైలైట్ చేయాల్సి వస్తుందో అని అసహనాన్ని వ్యక్తం చేసింది. తాను ఇంటర్వ్యూలో మాట్లాడిన మరిన్ని విషయాలను గుర్తు చేసింది. మన సంస్కృతి గురించి నేటి తరం పిల్లలకు ఏ మాత్రం అవగాహన లేకుండా పోతోందని ఆవేదన చెందింది. గాయత్రీ మంత్రం (Gayatri Mantra) అంటే ఏంటన్నది కూడా పిల్లలు చెప్పలేకపోతున్నారని కామెంట్ చేసింది. తన పిల్లలు కూడా ఇలాంటి పరిస్థితిలోనే ఉంటున్నారని.. వాటి గురించి చెబితే అర్థం కావడం లేదని అంటున్నారని వివరించింది. ఇది మాత్రమే కాకుండా.. ఇంకా చాలా విషయాలపై అభిప్రాయాలను వ్యక్తం చేసినట్టుగా చెప్పుకొచ్చింది.
ఇన్ని విషయాలు ఉన్నా కూడా.. తన రెండో పెళ్లిపైనే అందరికీ ఎందుకంత ఆరాటం అన్నట్టుగా.. రేణూ సీరియస్ అయ్యింది. ఇది తెలుసుకున్న ఆమె ఫ్యాన్స్ కూడా.. రేణూకే సపోర్ట్ గా నిలుస్తున్నారు. వ్యక్తిగత విషయాలను పబ్లిక్ గా మార్చే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేస్తున్నారు. ఓ తల్లిగా రేణూ దేశాయ్ సమర్థంగా నడుచుకుంటున్నారని.. పిల్లల కోసమే తన జీవితాన్ని కొనసాగిస్తున్న విషయాన్ని అంతా గుర్తించాలని కోరుతున్నారు. రెండో పెళ్లిపై ఆమె ఎప్పుడైనా నిర్ణయం తీసుకునే హక్కు ఉందని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికైనా.. ఇలాంటి విషయాలను పక్కనబెట్టి ప్రజలకు పనికివచ్చే విషయాలపై మీడియా ఫోకస్ చేస్తే బాగుంటుందని రేణూ దేశాయ్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
అయితే.. ఓ సెలెబ్రిటీగా ఆమె చెప్పే విషయాల్లో ముఖ్యమైన వాటిని వార్తలుగా మారిస్తే తప్పేంటని మీడియా వర్గాలు కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి.