పుష్ప (Pushpa) సినిమాతో అంతర్జాతీయంగా ఇంపాక్ట్ కలిగించిన ఐకన్ స్టార్ అల్లు అర్జున్.. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ సెన్సేషన్ ను సృష్టించేందకు ప్లాట్ ఫామ్ రెడీ చేస్తున్నాడు. అట్లీ (Atlee) దర్శకత్వంలో చేయనున్న తర్వాత సినిమా షూటింగ్ ను అతి త్వరలో మొదలు పెట్టబోతున్నాడు. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లకముందే.. రూమర్లతో రచ్చ రచ్చ చేస్తోంది. ఇందులో బన్నీ.. మాఫియా డాన్ గా కనిపించనున్నాడన్న వార్త.. ఫ్యాన్స్ కైతో పూనకాలు లోడ్ చేస్తోంది. ఇప్పటికే ఎర్ర చందనం స్మగ్లర్(red sandalwood smuggler) గా.. సినిమా ప్రపంచాన్ని ఊపేసిన అల్లు అర్జున్.. ఇప్పుడు మాఫియా డాన్ గా.. అది కూడా అట్లీ లాంటి మాస్ దర్శకుడి రూపకల్పనలో వస్తున్నాడంటే.. కచ్చితంగా సినిమా ప్రపంచాన్ని షేక్ చేయడం ఖాయమన్న కాన్ఫిడెన్స్.. ఫ్యాన్స్ లో బలంగా వ్యక్తమవుతోంది.
మరోవైపు.. ఇది మాఫియా డాన్ క్యారెక్టర్ కాదని.. సైన్స్ ఫిక్షన్ (science fiction-style) తరహాలో వస్తున్న సినిమా అనీ.. ఇందులో సూపర్ హీరో లాంటి పవర్ ఫుల్ క్యారెక్టర్ అని కూడా ఓ వెర్షన్ వినిపిస్తోంది. అందుకే.. అట్లీ, బన్నీ(bunny) ఇద్దరూ కలిసి అమెరికా(America) వెళ్లి మరీ గ్రాఫిక్స్ సంస్థతో మాట్లాడి వచ్చారని కొందరు అంటున్నారు. అయితే.. సైన్స్ ఫిక్షన్ కథాంశం అయినా.. మాఫియా డాన్ గా అయినా.. సబ్జెక్ట్ ఏదైనా సరే.. సినిమా ప్రపంచం విస్తుపోయేలా అట్లీ, బన్నీ మూవీ ఉండబోతోందన్న అంచనాలు మాత్రం బలంగా వ్యక్తమవుతున్నాయి. భారతీయ సినిమా చరిత్రపై ఇంతకుముందెన్నడూ వినని, చూడని అత్యున్నత, అత్యద్భుత స్థాయిలో ఈ సినిమా ఉండబోతోందని అంచనాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.
అట్లీతో చేయనున్న సినిమా తర్వాత కూడా.. బన్నీ చేయనున్న ప్రాజెక్ట్ పై ఆల్రెడీ బజ్ క్రియేట్ అయ్యింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) తో బన్నీ చేయబోయే నాలుగో సినిమా కావడం.. అది కూడా ఇప్పటివరకూ ఇండియన్ స్క్రీన్ పై రానటువంటి మైథలాజికల్ కాన్సెప్ట్ కావడం.. ఇప్పటికే సంచలనంగా మారింది. కథను ఫైనల్ చేసేందుకే త్రివిక్రమ్ ఆరు నెలలు అడిగాడంటే.. ఇది ఎంత పవర్ ఫుల్ గా ఉండనుందన్నదీ అర్థమవుతోంది. అందుకే.. బన్నీ చేయనున్న ఈ 2 ప్రాజెక్టులపై రోజురోజుకూ క్యూరియాసిటీ పెరుగుతోంది. అందులో ముఖ్యంగా.. అట్లీతో చేయనున్న సినిమా అయితే కచ్చితంగా భారతీయ సినిమా ప్రపంచాన్నే కాదు.. వరల్డ్ వైడ్ గా సెన్సేషనల్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.
ఓవరాల్ గా చూస్తే.. అట్లీతో పాటు.. త్రివిక్రమ్ తో చేయనున్న సినిమాలపై.. ముందు ముందు ఎలాంటి వార్త వచ్చినా అది సంచలనంగా మారే పరిస్థితులు ఇప్పటినుంచే కనిపిస్తున్నాయి.