ఈ నెల 25న తెల్లవారుఝామున.. అంటే 2025 ఏప్రిల్ 25 శుక్రవారం నాడు తెల్లవారుఝామున.. సూర్యోదయానికి కాస్త ముందుగా.. ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది. మనందరికీ ఎమోజీలు వాడే అలవాటు ఉంది కదా. అందులో స్మైలీ ఎమోజీని చాలా సందర్భాల్లో వాడుతుంటాం కదా. అలాంటి స్మైలీ.. వచ్చే శుక్రవారం తెల్లవారుఝామున ఆకాశంలో కనిపించనుంది. సైన్స్ వెబ్ సైట్ లైవ్ సైన్స్ వెల్లడించిన ప్రకారం.. శుక్రుడు, శని, నెలవంక(Venus, Saturn, and the crescent moon).. వచ్చే శుక్రవారం తెల్లవారుఝామున చాలా దగ్గరికి రానున్నాయట. ఆ మూడూ కలిసి.. స్మైలీ మాదిరిగా కనిపిస్తాయట. ఈ దృశ్యాన్ని ప్రపంచంలోని ఎక్కడినుంచైనా మనం చూసే అవకాశం ఉందని ఆ వెబ్ సైట్ తెలిపింది. అయితే.. ఆకాశం నిర్మలంగా ఉండి.. మబ్బులు లేకుండా ఉంటే మరింత ఎక్కువగా అవకాశం ఉంటుందని ఆ కథనం వివరించింది.
శుక్రుడు, శని.. ఈ రెండు గ్రహాలు.. కళ్లుగా కనిపిస్తాయని.. వాటి కిందుగా నెలవంక వచ్చి.. చిరునవ్వుతో ఉన్న పెదాలుగా కనిపిస్తుందని.. ఈ మూడూ కలిపి స్మైలీ ఎమోజీలా ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం అవుతుందని.. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన సోలార్ సిస్టమ్ అంబాసిడర్ బ్రెండా కల్ బర్టన్(Brenda Cul Burton) కూడా తెలిపారు. శుక్రుడు, శని.. ఆ సమయంలో సాధారణం కంటే ఎక్కువగా ప్రకాశవంతంగా ఉంటాయని చెప్పారు. కాబట్టి.. వాటిని సాధారణ కళ్లతోనే మనం చూడవచ్చని స్పష్టం చేశారు. అయితే.. స్మైలీ ఎమోజీ ప్రతిబింబాన్ని చూడాలంటే.. స్టార్ గేజింగ్ బైనాక్యులర్, టెలిస్కోప్ వంటి పరికరాల అవసరం పడవచ్చని అంచనా వేశారు. అది.. ఆ రోజు ఆయా ప్రాంతాల్లోని వాతావరణాన్ని బట్టి ఉంటుందని తెలిపారు.
సో.. ఆకాశంలో జరిగే ఈ అద్భుతాన్ని మనం వీక్షించాలని భావిస్తే.. అందుకు అనుకూలమైన ఏర్పాట్లు చేసుకోవాలి. లేదంటే.. దగ్గర్లోని ప్లానిటోరియం నిర్వాహకులు ఏమైనా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారేమో తెలుసుకుని.. వారి సహాయంతో అయినా ఈ అద్భుతాన్ని చూసే అవకాశాన్ని పొందాలి. అదృష్టం బాగుండి.. కాలం కలిసొస్తే.. వాతావరణం అనుకూలంగా ఉంటే.. ఆకాశంలో స్మైలీ ఇమేజ్ ను మనమంతా వీక్షించే అవకాశమైతే ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. ఇది పెద్దవాళ్లనే కాదు.. చిన్న పిల్లలను కూడా బాగా అట్రాక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇలాంటి అవకాశాలు మళ్లీ మళ్లీ కూడా రావు. అందుకే ఏ మాత్రం అవకాశం ఉన్నా.. ఈ మూమెంట్ ను వదులుకోకండి. మరింత మందికి ఈ విషయాన్ని చేరవేయండి. ఖగోళ విషయాలపై ఆసక్తి ఉన్నవారికి ఇది తెలియజేయండి.