సమంత(Samantha).. రాజ్ నిడిమోరు(Raj Nidimoru).. మళ్లీ మీడియా హెడ్ లైన్స్ లో కనిపించారు. తిరుమల స్వామివారి(Tirumala Swami) దర్శనం కోసం వెళ్లిన ఈ జంట.. మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. చాలా కాలంగా.. ఈ ఇద్దరూ రిలేషన్ లో ఉన్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో.. మరోసారి ఇదే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. తిరుమలలో ఇద్దరూ ఒకేసారి కనిపించడంతో ఇప్పటికైనా ఈ ఇద్దరిలో ఒకరైనా.. తమ అనుబంధం గురించి చెబుతారేమోనని అంతా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా.. సమంత అభిమానులైతే.. ఆ అప్ డేట్ కోసం వెయ్యి కళ్లతో వేచి చూస్తున్నారు. కానీ.. సైలెంట్ గా పని ముగించుకుని వెళ్లిన సమంత.. ఆ క్యూరియాసిటీని అలాగే కంటిన్యూ చేస్తోంది. తన ప్రొడక్షన్ లో తొలి సినిమాగా వస్తున్న శుభం చిత్ర బృందంతో కలిసి.. స్వామి వారిని దర్శించుకుంది.
ఈ సందర్భంగా.. సమంత వెంట రాజ్ నిడిమోరు కూడా ఉండడం.. అందరి దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరోవైపు.. ఇద్దరూ కలిసి రాహు కేతు(Rahu ketu) పూజలు కూడా చేయించుకున్న తీరు.. మరింత సంచలనాన్ని సృష్టించింది. త్వరలో.. ఇద్దరూ పెళ్లి చేసుకోవడం కోసమే ఇలాంటి పూజలు చేసుకుంటున్నారని అంటూ చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఇదే ఏడాది మంచి ముహూర్తం చూసుకుని.. ఇద్దరూ ఒకటి అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని ఆ ఇద్దరి సన్నిహిత వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. అయితే.. ఇద్దరిలో.. కనీసం ఒక్కరైనా ఇందుకు సంబంధించి నోరు తెరిస్తే కానీ.. పూర్తి స్పష్టత వచ్చేలా లేదు. అప్పటివరకూ సమంత అభిమానుల ఎదురు చూపులు కూడా తప్పేలా లేవు.
ఇప్పటికే సమంత.. నాగచైతన్యను(Naga Chaitanya) పెళ్లి చేసుకుని తర్వాత విడాకులు తీసుకుని ఒంటరి జీవితాన్ని గడుపుతోంది. నాగచైతన్య కూడా కొంతకాలం ఒంటరిగానే ఉన్నా.. తర్వాత శోభితను పెళ్లి చేసుకుని హ్యాప్పీగా ఉన్నాడు. మరోవైపు.. సమంత కూడా పెళ్లికి సిద్ధమైందని, రాజ్ నిడిమోరును తన జీవిత భాగస్వామిగా ఆమె అంగీకరించిందని చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. కానీ.. తన జీవితంలోని గత అనుభవాల దృష్ట్యా.. తొందరపడవద్దని, అన్నీ ఆలోచించిన తర్వాత పూర్తి స్థాయిలో నిర్ణయాన్ని తీసుకోవాలని సమంత భావించి ఉండవచ్చు. అందుకే.. తన జీవితంలోకి భాగస్వామిగా వస్తున్న కొత్త వ్యక్తి గురించి ప్రకటన చేయడానికి ఆమె ఆలోచిస్తూ ఉండవచ్చు. ఈ ఆలస్యమే.. గందరగోళానికి కారణం అవుతోంది. సమంత ఆనందంగా ఉంటే చూడాలని ఆప్యాయంగా కోరుకుంటున్న అభిమానుల్లో ఆవేదన కలిగిస్తోంది. కానీ.. రాజ్ నిడిమోరుతో చేస్తున్న జీవిత ప్రయాణాన్ని గమనిస్తున్న అభిమానులంతా.. ఏదో ఓ క్షణాన సమంత శుభవార్త చెప్పకపోతుందా అని ఎదురు చూస్తున్నారు.
తాజాగా.. తిరుమలకు ఇద్దరూ కలిసి వెళ్లడం, ఈ క్రమంలోనే రాహుకేతు పూజలను ఇద్దరూ కలిసి చేసుకున్న పరిణామాలపై.. సమంత ఫ్యాన్స్ అయితే చాలా సంతోషంగా ఉన్నారు.