జపాన్‌ను (Japan) చుట్టేస్తున్నారు.. తెలంగాణ (Telangana) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy). అక్కడ మన రాష్ట్ర యువతకు ఉన్న ఉపాధి అవకాశాలు పరిశీలించడమే కాక.. జపాన్ పారిశ్రామిక సంస్థలను తెలంగాణకు రప్పించేందుకు కూడా విస్తృతంగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. గతంలో పారిశ్రామిక కాలుష్యంతో ఇబ్బంది పడి.. ఇప్పుడు పొల్యూషన్ లేని నగరాల్లో ఒకటిగా ఖ్యాతి గాంచిన కిటాక్యాషు (Kitakyushu) నగరాన్ని సందర్శించారు. ప్రపంచంలోని పరిశుభ్ర నగరాల్లో ఒకటిగా కిటాక్యాషు ఎలా ఎదిగిందన్నది అధ్యయనం చేశారు. ఆ నగర మేయర్ టేకుచితో (Mayor Takeuchi) సమావేశమై.. పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ఈ రెండు నగరాల మధ్య విమానాల రాకపోకలపైనా చర్చలు చేశారు.
అక్కడితో ఆగని ముఖ్యమంత్రి.. తెలంగాణలో జపనీస్ కళాశాల (Japanese Language College) ఏర్పాటు చేసి.. ఇక్కడి వారికి జపాన్ భాష (Japanese Language) నేర్పిస్తే.. జపాన్‌లో ఉద్యోగ అవకాశాలు పొందే పరిస్థితి ఉంటుందని ఓ ప్రతిపాదన చేశారు. హైదరాబాద్‌లో ఎకో టౌన్ (Eco Town) ఏర్పాటు ప్రతిపాదనపై.. ఈఎక్స్ రీసర్చ్ ఇన్ స్టిట్యూట్ (EX Research Institute), పీ9 ఎల్ఎల్ సీ (P9 LLC), నిప్పాన్ స్టీన్ ఇంజినీరింగ్ (Nippon Steel Engineering), న్యూ కెమికల్ ట్రేడింగ్ (New Chemical Trading), అమితా హోల్డింగ్స్ (Amita Holdings) వంటి అంతర్జాతీయ స్థాయి సంస్థలతో ఒప్పందాలు కూడా చేసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఆయా సంస్థల ప్రతినిధులు కూడా సంబంధిత పత్రాలపై సంతకాలు చేసుకున్నారు. హైదరాబాద్‌ను పరిశుభ్ర నగరంగా మార్చేందుకు అవసరమైన ఒప్పందాలు కూడా వీటిలో ఉన్నాయి.
హైదరాబాద్‌లో ఎకో టౌన్ ఏర్పాటు ద్వారా.. భవిష్యత్ తరాలకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలన్నదే.. తన ప్రభుత్వ ఉద్దేశంగా రేవంత్ రెడ్డి (Revanth Reddy) చెప్పారు. పరిశ్రమల అభివృద్ధికి హైదరాబాద్ కేంద్రంగా మారిందని.. ప్రపంచ ప్రఖ్యాత సంస్థలన్నీ హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్నాయని వివరించారు. జపాన్ సంస్థలు కూడా తెలంగాణకు వస్తే.. తగిన వసతులు, ప్రభుత్వ పరంగా రాయితీలు ఇస్తామని చెప్పారు. ఇలా అభివృద్ధిని కొనసాగిస్తూనే.. హైదరాబాద్‌ను క్లీన్ అండ్ గ్రీన్‌గా మార్చాలన్నది తమ లక్ష్యంగా జపాన్ పారిశ్రామిక వర్గాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Minister Duddilla Sridhar Babu) స్పష్టం చేశారు. ఈ సందర్భంగా.. కిటాక్యాషు నగర మేయర్ టేకుచి.. రేవంత్ రెడ్డిని తమ స్థానిక సంప్రదాయం ప్రకారం సత్కరించారు. తన నగర విశిష్టతను వివరించారు.
ఓవరాల్‌గా.. హైదరాబాద్ అభివృద్ధిలో భాగం కావాలని పిలుపునివ్వడంతో పాటు.. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు వివరిస్తూ.. జపాన్ పర్యటనను విజయవంతం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy).