Home Telangana Harish Rao Gets Emotional in Siddipet School Event:సిద్దిపేట స్కూల్ లో హరీష్ రావు...

Harish Rao Gets Emotional in Siddipet School Event:సిద్దిపేట స్కూల్ లో హరీష్ రావు భావోద్వేగం

Harish Rao emotional moment
Harish Rao emotional moment

భద్రంగా ఉండాలి.. భవిష్యత్తులో ఎదగాలి (Bhadhranga Undali.. Bhavishyathulo Edagali) పేరుతో.. సిద్దిపేట (Siddipet) లోని స్కూల్ లో ఓ అవగాహన సదస్సు జరిగింది. స్థానిక ఎమ్మెల్యే, BRS (Bharat Rashtra Samithi) సీనియర్ నాయకులు, మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా.. కొందరు పసి పిల్లలు తమ జీవితాల్లో జరిగిన సంఘటనలు వివరిస్తూ.. తాము ఎంతగా కష్టపడ్డామన్నది, కష్టపడుతున్నామన్నది తెలియజేస్తూ.. తీవ్రంగా ఆవేదన చెందారు. సాత్విక (Sathvika) అనే చిన్నారి మాట్లాడుతూ.. తన కుటుంబ పరిస్థితిని వివరించింది. ఆమె చెప్పిన విషయాలకు.. అక్కడున్న వాళ్లంతా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు. ముఖ్యంగా.. హరీష్ రావు (Harish Rao) అయితే ఏకంగా కంటతడి పెట్టుకున్నారు. ఆ చిన్నారిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని ధైర్యం చెప్పారు. తామంతా అండగా ఉన్నామని భరోసా కల్పించారు. అధైర్యపడవద్దంటూ చిన్నారి భుజం తట్టారు.

సాత్విక (Sathvika) తన కుటుంబ పరిస్థితులు వివరించిన తీరు.. నిజంగానే అక్కడున్న వాళ్లందరినీ కదిలించింది. తాను రెండో తరగతి చదువుతున్నప్పుడు తండ్రి చనిపోయాడని.. అప్పటి నుంచి తన తల్లే తనను చూసుకుంటోందని తెలిపింది. కానీ.. తన తల్లిని తాను ఊరికే తిడుతుండేదాన్నని.. ఇకపై అలా చేయబోనని చెబుతూ ఏడ్చేసింది. తన తల్లిని ఇక బాగా చూసుకుంటానని కూడా ఏడుస్తూనే చెప్పింది. అమ్మకు మంచి పేరు తీసుకువస్తానని చెప్పింది. ధన్యవాదాలు అంటూ వెక్కి వెక్కి కన్నీళ్లు పెట్టుకుంది. సాత్విక (Sathvika) మాట్లాడుతుండగానే హరీష్ రావు (Harish Rao) ఓ దశలో ఆవేదనకు గురయ్యారు. చివరికి సాత్విక కంటతడి పెట్టగానే.. ఆయన కూడా ఎమోషన్ ను కంట్రోల్ చేసుకోలేకపోయారు. చివరికి.. ఆమెను చేరదీసి ఏడవొద్దంటూ కన్నీళ్లు తుడిచారు. కాసేపు తన పక్కనే కూర్చోబెట్టుకున్నారు.

ఆ తర్వాత.. మరికొందరు పిల్లలు కూడా తమ కుటుంబ పరిస్థితులు వివరించారు. అనంతరం.. హరీష్ రావు (Harish Rao) చాలా ఉద్వేగంగా మాట్లాడారు. తల్లిదండ్రుల గౌరవాన్ని అందరికీ అర్థమయ్యేట్లు చెప్పిన ఈ చిన్నారులను ప్రతి ఒక్కరూ చప్పట్లతో అభినందించాలని అన్నారు. “I love my parents”, “I love my teachers” అని ప్రామిస్ చేయాలంటూ అందరినీ ఉత్సాహపరిచారు. ఫోన్లు చూస్తూ టైమ్ వేస్ట్ చేయడం కంటే.. అమ్మ చెప్పిన మాట వినాలని, తల్లిదండ్రులను గౌరవించాలని హరీష్ రావు (Harish Rao) విలువైన సూచన చేశారు. అందరిలో ఈ దిశగా మంచి మార్పు రావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఈ సమావేశంలో హరీష్ రావు (Harish Rao) కంటతడి పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో (Social Media) వైరల్ గా మారింది.

రాజకీయాల్లో హరీష్ రావు (Harish Rao) తో వాదన పెట్టుకోవాలన్నా.. విమర్శించాలన్నా.. ఇప్పటికీ చాలా మంది ఆలోచిస్తుంటారు. అంతా క్లారిటీ వచ్చాకే హరీష్ పై విమర్శలు చేస్తుంటారు. అంతటి ప్రభావాన్ని కలిగించిన హరీష్ రావు (Harish Rao).. ఇంతటి సున్నిత మనస్కుడా అనిపించేలా ఆయన ఈ సమావేశంలో ఎమోషనల్ అయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here