తెలంగాణ Congress సీనియర్ నేతల్లో ఒకరు.. చాలా కాలంగా మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న నాయకుల్లో ముందున్నవారు Komatireddy Raj Gopal Reddy. ఆయనకు కోపం వస్తే.. సహనం హద్దులు దాటితే.. ముఖ్యమంత్రి Revanth Reddy గురించి కూడా సీరియస్‌గా మాట్లాడగలరు. తన పార్టీ నాయకత్వంలో ఉన్న ప్రభుత్వాన్నే విమర్శించగలరు. అవసరమైతే.. ప్రతిపక్ష పార్టీపై ప్రశంసలు కురిపించగలరు.. ప్రతిపక్షం గతంలో అధికారంలో ఉన్నప్పుడే పాలన బాగుందని కామెంట్ చేయగలరు. అలాంటి నేత.. రీసెంట్‌గా.. తనకు దక్కాల్సిన మంత్రి పదవిపై చిర్రుబుర్రులాడారు. సీనియర్ నాయకుడు అయిన Jana Reddy.. తన పదవికి అడ్డం పడుతున్నారని అన్నారు. పదవి ఎప్పుడో రావాల్సి ఉన్నా.. Jana Reddy అడ్డం పడుతున్న కారణంగానే.. తాను ఎదురుచూడాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. ఈ విషయం అప్పట్లో సంచలనాన్ని సృష్టించినా.. ఇన్నాళ్లకు దానికి సంబంధించిన ప్రతిస్పందన కనిపిస్తున్నట్టే ఉంది.
ఎలాంటి సందర్భంలో అయినా సరే.. “Fire fights the fire, I am the fire” అన్నట్టుగా మాట్లాడే Raj Gopal Reddy.. సడన్‌గా సైలెంట్ అయ్యారు. పార్టీ వ్యవహారాల రాష్ట్ర ఇన్‌ఛార్జ్ Meenakshi Natarajan తో సమావేశమైన తర్వాత.. మీడియాతో మాట్లాడుతూ టోన్ డౌన్ చేశారు. “Jana Reddy మా పార్టీ సీనియర్ నేత.. ఆయనంటే నాకు గౌరవం ఉంది.. మంత్రి పదవి అన్నది పార్టీ తీసుకోవాల్సిన నిర్ణయం” అంటూ.. పూర్తిగా చల్లబడిపోయినట్టు ప్రశాంతంగా మాట్లాడారు. ఇన్నాళ్లూ మంత్రిపదవిపై బలమైన ఆశలు పెట్టుకోవడం మాత్రమే కాకుండా.. అధిష్టానం తనకు ఆ దిశగా హామీ ఇచ్చిందని పదే పదే చెప్పడం మాత్రమే కాకుండా.. Revanth పరిపాలన తీరుపై, సీనియర్ నాయకుడైన Jana Reddy తీరుపై అంతెత్తున ఎగిరిపడ్డారు Raj Gopal Reddy. అలాంటి ఆయన.. ఇప్పుడిలా పూర్తిగా చల్లబడిపోవడాన్ని ఆయన అనుచురులు కూడా నమ్మని పరిస్థితి నెలకొంది. అసలు ఆయన ఎందుకిలా మాట్లాడారన్న చర్చ కూడా జరుగుతోంది.
రీసెంట్‌గా.. ముఖ్యమంత్రి Revanth Reddy.. పార్టీ సీనియర్లకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. నోటికొచ్చినట్టు మాట్లాడితే వారికే నష్టమని తేల్చి చెప్పారు. పార్టీ లైన్ దాటితే సహించేది లేదని.. మంత్రి పదవి అన్నది పార్టీ తీసుకోవాల్సిన డెసిషన్ అని స్పష్టం చేశారు. ఈ విషయాలపై పట్టింపు లేకపోతే.. నష్టపోయేది ఆశావహులే అన్నారు. ఏదైనా సరే.. High Command నిర్ణయమే ఫైనల్ అని తేల్చేశారు. మరోవైపు.. Congress రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా Meenakshi Natarajan వచ్చాక.. పార్టీ చేస్తున్న రాజకీయాల తీరే మారిపోయింది. పాత సీనియర్లకు మళ్లీ పార్టీలో పట్టు పెరిగింది. ఈ క్రమంలోనే.. Jana Reddyపై చేసిన వ్యాఖ్యలకు.. Raj Gopal Reddyకి ఆమె నుంచి మందలింపులు ఎదురై ఉంటాయన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. గతంలో ఉమ్మడి రాష్ట్రానికి హోం మంత్రిగా పనిచేసిన రాజకీయ కురవృద్ధుడు, ఎంతో కాలంగా Congressతోనే ఉంటున్న సీనియర్ నాయకుడు అయిన Janaపై అలా ఎలా మాట్లాడతారంటూ.. తనతో సమావేశమైన Raj Gopalపై Meenakshi సీరియస్‌గా మాట్లాడారని, క్లాస్ పీకారని తెలుస్తోంది.
తీరు మార్చుకోకుంటే.. మంత్రి పదవి గురించి మరిచిపోవాల్సిందేనని Raj Gopalకు Meenakshi స్పష్టం చేసి ఉంటారన్న అంచనాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అందుకే.. తప్పని పరిస్థితుల్లో Janaపై గౌరవం, మంత్రి పదవిపై అధిష్టానానిదే నిర్ణయం.. అంటూ Raj Gopal Reddy టోన్ డౌన్ చేసి ఉంటారని కార్యకర్తలు కూడా అనుకుంటున్నారు.