Home National & International Evidence Pakistan Behind Terror Attack:పహల్గామ్ బైసరన్ లోయలో ఉగ్రదాడి వెనక పాకిస్తానే ఉందని ఆధారాలు

Evidence Pakistan Behind Terror Attack:పహల్గామ్ బైసరన్ లోయలో ఉగ్రదాడి వెనక పాకిస్తానే ఉందని ఆధారాలు

Evidence Points to Pakistan Behind Terror Attack in Baisaran Valley, Pahalgam
Evidence Points to Pakistan Behind Terror Attack in Baisaran Valley, Pahalgam

Jammu & Kashmir లోని Pahalgam దగ్గర Baisaran Valleyలో జరిగిన ఉగ్రదాడి వెనక Pakistanనే ఉందని చెప్పేందుకు.. స్పష్టమైన ఆధారాలు వెలుగుచూస్తున్నాయి. Delhiలోని Pak High Commission కార్యాలయం దగ్గర జరిగిన ఓ ఘటన.. ఈ దిశగా బలమైన సంకేతాలను ఇస్తోంది. Indiaలో ఉగ్రదాడి జరిగిన తర్వాత.. ఓ వ్యక్తి Delhiలోని Pak High Commission కార్యాలయంలోకి కేక్ తో వెళ్లిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఓ విలేకరి అతన్ని అనుమానంతో ప్రశ్నించాడు కూడా. “ఏ సంబరాలు చేసుకునేందుకు కేక్ తీసుకువెళ్తున్నారు.. అసలు కేక్ తీసుకువెళ్లాల్సిన సందర్భం ఏంటి.. మీరు ఎవరు..?” అంటూ అతను ప్రశ్నల వర్షం కురిపిస్తున్నా కూడా.. అతను మాట మాత్రం రిప్లై ఇవ్వలేదు. ఎలాంటి సమాధానం ఇవ్వకుండానే అతను అనుమానాస్పద రీతిలో అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

Pakistan ఆర్మీ గురించిన మరో సంచలన విషయం.. తాజా Pakistan ఓవర్సీస్ సదస్సులో మాట్లాడిన Pakistan ఆర్మీ చీఫ్ Asim Munir రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. తమ మతం, సంప్రదాయాలు ప్రత్యేకమైనవి అని.. Kashmir గతంలో తమకు జీవనాడిలా ఉండేదని.. భవిష్యత్తులో కూడా ఉంటుందని.. ఈ వాస్తవాలను పిల్లలకు వివరించాలని.. Kashmiri సోదరుల పోరాటంలో వారిని ఒంటరిగా వదిలివేయలేమని.. రకరకాలుగా రెచ్చగొట్టే కామెంట్లను చేశారు. ఇది జరిగిన కొన్నాళ్లకే.. Baisaran Valleyలో ఉగ్రదాడి జరిగింది. అంటే.. కచ్చితంగా ప్లాన్ ప్రకారమే.. ఇదంతా చేసి ఉంటారన్న అనుమానాలు బలపడుతున్నాయి. దీనికి తోడు.. దాడి జరిగిన కొద్దిమొత్తంలోనే.. Pakistan Air Force కు చెందిన ట్రాన్స్ పోర్ట్, ఇంటెలిజెన్స్ విమానాలను.. Karachi నుంచి Rawalpindi, Lahore బేస్ లకు తరలించడం కూడా అనుమానాలను బలపరుస్తోంది. దాడి తర్వాత India నుంచి ప్రతిఘటన ఎదురైతే.. తట్టుకునేందుకు ఈ జాగ్రత్తలను Pakistan తీసుకున్నట్టుగా కనిపిస్తోంది.

Pakistan కు చెందినవాళ్లు కూడా Pakistanనే తప్పుబడుతుండడం.. ఈ విషయంపై Pakistan ప్రభుత్వ పెద్దలు సైలెంట్ గా ఉండడం చూస్తుంటే.. మౌనం అర్థాంగికారం అన్న మాట గుర్తుకు వస్తోంది. Kashmir లో అంత భయంకరమైన ఉగ్రదాడి జరిగితే.. Pakistan కనీసం ఒక్క ఊరడింపు మాట కూడా మాట్లాడకపోవడం ఏంటని ఆ దేశానికే చెందిన మాజీ క్రికెటర్ Danish Kaneria తప్పుబట్టాడు. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చి.. ప్రోత్సహించేది Pakistanనే కాబట్టి ఈ ఘటనపై సిగ్గుపడాలి అంటూ తీవ్ర స్థాయిలో కామెంట్ చేశాడు. Kaneria చేసిన కామెంట్లపై కూడా.. Pakistan ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడాన్ని అంతా సీరియస్ గా తీసుకుంటున్నారు. అలాగే.. దాడి చేసిన వారి గురించి, వారి ఉగ్ర మూలాల గురించి స్పష్టమైన ఆధారాలను India మీడియాలో చూస్తున్నా కూడా.. Pakistan ప్రభుత్వం తమ తప్పేం లేదని ఇంకా బుకాయించడాన్ని అంతా తప్పుబడుతున్నారు.

కచ్చితంగా ఈ ఘటన వెనక Pakistanనే ఉందని.. ఆ విషయం ఇప్పుడు కాకున్నా అతి త్వరలోనే బయటపడడం ఖాయమని.. Baisaran Valleyలో ఉగ్రదాడికి Pakistan తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని Indians బలంగా నమ్ముతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here