శ్రీనిధి శెట్టి సినీ రంగంలోకి అడుగుపెట్టే ముందు మోడలింగ్ ప్రపంచంలో తనదైన ముద్ర వేసింది. 2015లో మిస్ కర్ణాటక టైటిల్‌తో పాటు మిస్ బ్యూటీఫుల్ స్మైల్ కిరీటం సొంతం చేసుకుంది. ఈ విజయాలతో ప్రోత్సాహం పొందిన శ్రీనిధి, 2016లో మిస్ సుప్రనేషనల్ ఇండియా టైటిల్ గెలుచుకుంది.
అంతర్జాతీయ స్థాయిలో జరిగిన మిస్ సుప్రనేషనల్ పోటీలో విజయం సాధించి, ప్రపంచ స్థాయిలో గౌరవాన్ని తెచ్చిన రెండవ భారతీయురాలిగా గుర్తింపు పొందింది.ఈ విజయాలతో ఆమెకు సినిమాలకీ అవకాశాలు వచ్చాయి. 2018లో యష్ సరసన KGF: Chapter 1 లో హీరోయిన్గా నటించి తొలి సినిమాతోనే భారీ విజయం సాధించింది.
ఆ చిత్రం పాన్-ఇండియా హిట్ అవ్వడంతో ఆమె పేరు దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అనంతరం 2022లో వచ్చిన KGF: Chapter 2 లోనూ ఆమె నటన ప్రశంసలు పొందింది.ఇందుకు తోడు, తమిళ సినీ ఇండస్ట్రీలోనూ శ్రీనిధి తన ప్రతిభను చాటింది.
ప్రముఖ హీరో విక్రమ్ సరసన కోబ్రా చిత్రంలో నటించి కోలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఇప్పుడు తెలుగు సినిమాల్లోనూ ఆమె వేగంగా ఎదుగుతోంది. నాని సరసన హిట్ 3 చిత్రంలో నటించి విజయాన్ని నమోదు చేసింది. ప్రస్తుతం యూత్ హీరో సిద్ధు జొన్నలగడ్డతో కలిసి తెలుసు కదా అనే సినిమాలో నటిస్తోంది.
సినిమాలకే కాకుండా సోషల్ మీడియాలోనూ శ్రీనిధి శెట్టి క్రియాశీలకంగా ఉంటోంది. తన తాజా ఫోటోలు, షూటింగ్ అప్డేట్స్, వ్యక్తిగత విశేషాలు అభిమానులతో పంచుకుంటూ, నిత్యం టచ్‌లో ఉంటూ యువతలో మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది.
ఫ్యాషన్ సెన్స్, గ్రేస్‌ఫుల్ ప్రెజెన్స్‌తో ఆమె నూతన తరం ప్రేక్షకులకు ఆహ్లాదంగా మారింది. ఇప్పటివరకు చేసిన సినిమాల కంటే ముందున్న అవకాశాలు మరింత పెద్దవిగా ఉండేలా కనిపిస్తున్నాయి.