పహల్గామ్ ఉగ్రదాడికి(Pahalgam Attack) భారత్ గట్టి ప్రతీకారం తీసుకుంది. ‘ఆపరేషన్ సింధూర్’లో(Operation sindoor) భారత సైన్యం పాకిస్తాన్‌లో నాలుగు, పీవోకేలో ఐదు ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసి, 30మందికి పైగా కీలక ఉగ్రవాదులను హతమార్చింది. ఈ విజయంపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawa kalyan) స్పందిస్తూ, ప్రధాని మోదీ నేతృత్వంలో దేశం ధైర్యంగా ప్రతిస్పందించిందని ప్రశంసించారు. ఉగ్రవాదంపై మోదీ తీసుకున్న నిర్ణయాలు గర్వకారణమని అన్నారు.
సమయానికి ప్రభుత్వానికి మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందని పవన్ పిలుపునిచ్చారు. దేశానికి వ్యతిరేకంగా మాట్లాడే సోషల్ మీడియా వేదికలపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కాంగ్రెస్ నేతలపై మండిపడి, పాక్‌కు అనుకూలంగా వ్యవహరించడం తప్పని చెప్పారు. హిందువులపై దశాబ్దాలుగా దాడులు కొనసాగుతున్నాయని, కశ్మీర్ పండితుల పరిస్థితిని గుర్తు చేశారు. ఉగ్రవాదాన్ని పూర్తిగా అణచివేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.










