
ఐడీబీఐ బ్యాంక్ లిమిటెడ్(IDBI Bank LTD) దేశవ్యాప్తంగా ఉన్న శాఖలలో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ మేనేజర్(Junior Assistant manager) పోస్టుల నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 676 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (గ్రేడ్-ఓ) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తిగల అభ్యర్థులు మే 8, 2025 నుండి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేయవచ్చు.
ఈ పోస్టులకు అర్హతగా కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత అవసరం. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 55 శాతం మార్కుల సడలింపు ఉంది. అదనంగా అభ్యర్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండటం తప్పనిసరి. వయోపరిమితి విషయానికి వస్తే, అభ్యర్థులు మే 2, 2000 నుంచి మే 1, 2005 మధ్య జన్మించి ఉండాలి. రిజర్వేషన్ ఉన్నవర్గాలకు వయో పరిమితిలో మినహాయింపు వర్తిస్తుంది.
ఆసక్తి గల అభ్యర్థులు మే 20, 2025లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1050గా, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.250గా నిర్ణయించారు. అభ్యర్థుల ఎంపిక రాత పరీక్ష, ఇంటర్వ్యూ మరియు మెడికల్ పరీక్షల ఆధారంగా జరగనుంది.