Home Entertainment Virgin Boys Teaser : యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీకి రెడీ

Virgin Boys Teaser : యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీకి రెడీ

Virgin-boys
Virgin-boys

హీరో గీతానంద్, హీరోయిన్ మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘వర్జిన్ బాయ్స్’ టీజర్ విడుదలై, యూత్‌లో చర్చనీయాంశంగా మారింది. శ్రీహాన్, రోనీత్, జెన్నిఫర్, అన్షుల, సుజిత్ కుమార్, అభిలాష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి దయానంద్ దర్శకత్వం వహించగా, రాజా దరపునేని రాజ్‌గురు ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మించారు.

టీజర్‌లో రంగుల వాతావరణం, యూత్‌ఫుల్ టోన్ ఆకట్టుకుంటున్నాయి. స్మరణ్ సాయి సంగీతం చైతన్యాన్ని నింపగా, వెంకట ప్రసాద్ సినిమాటోగ్రఫీ నూతనంగా, ఉత్సాహంగా కనిపిస్తోంది. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ టీజర్‌ను కటుపరచి క్రిస్పీగా మార్చింది. గీతానంద్, మిత్రా శర్మ మధ్య కెమిస్ట్రీ బాగా పండింది.

కథలో హాస్యం, ప్రేమ, భావోద్వేగాలు కలిసి ఆధునిక రిలేషన్‌షిప్స్‌పై ఓ ప్రత్యేక కోణంలో దృష్టి సారించారు. బిగ్ బాస్ ఫేమ్ శ్రీహాన్ క్యారెక్టర్ మరియు టైమింగ్‌కి మంచి స్పందన వస్తోంది. అతనితో మరింత హాస్యం చూడొచ్చని సూచనలు ఉన్నాయి. టీజర్‌లోని డైలాగ్స్, సన్నివేశాలు ఫన్ ఎలిమెంట్స్‌ను హైలైట్ చేస్తూ యూత్‌ను ఆకట్టుకుంటున్నాయి.

ఈ సమ్మర్‌లో థియేటర్లలో ‘వర్జిన్ బాయ్స్’ యూత్‌ని ఎంటర్‌టైన్ చేయనుందని మేకర్స్ చెబుతున్నారు. నిర్మాత రాజా దరపునేని మాట్లాడుతూ, “యూత్‌కి మరింతగా కనెక్ట్ అయ్యేలా సినిమాను రూపొందించాం. గతంలో వచ్చిన యూత్‌ఫుల్ ఎంటర్టైనర్‌లకంటే ఇది వైవిధ్యంగా ఉండబోతుంది” అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here