శంకర్ చేగూరి దర్శకత్వంలో రూపొందుతున్న హిలేరియస్ ఎంటర్టైనర్ ‘బద్మాషులు’ నుంచి తాజా సాంగ్ **‘లోకం మారిందా’**ను హీరో నవీన్ చంద్ర విడుదల చేశారు. మహేష్ చింతల, విద్యాసాగర్ కారంపురి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా, తార స్టొరీ టెల్లర్స్ బ్యానర్ పై బి. బాలకృష్ణ మరియు C. రామ శంకర్ నిర్మిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ మరియు టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. తాజాగా విడుదలైన పాట కూడా యూత్‌ను ఆకట్టుకుంటోంది. తేజ కూనూరు సంగీతం అందించగా, దివ్య మాలిక గానం చేసిన ఈ పాట క్యాచీగా ఉందని, మంచి రెస్పాన్స్ రావొచ్చని నవీన్ చంద్ర అభిప్రాయపడ్డారు. జూన్ 6న విడుదల కానున్న ఈ సినిమా విజయవంతం కావాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సినిమాలో పాత్రలు, కథనం, కామెడీ అన్నీ రూరల్ రూట్డ్ టచ్‌లో సహజంగా ఉంటాయని, మహేష్, విద్యాసాగర్, మురళీధర్ గౌడ్ పాత్రలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని తెలుస్తోంది. దర్శకుడు శంకర్ చేగూరి టేకింగ్ ఫ్రెష్‌గా ఉండి, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు.
‘ఇది మన ఊరి కథ’ అన్నట్లుగా, సహజమైన పాత్రలు, సన్నివేశాలతో నవ్వు పుట్టించే ఉద్దేశంతో ఈ సినిమా తెరకెక్కించబడింది. జూన్ 6న ‘బద్మాషులు’ను దీపా ఆర్ట్స్ థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.