
అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ ఆసుపత్రి సమీపంలో జరిగిన బాంబు పేలుడు కలకలం రేపుతోంది. ఈ దుర్ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు కాలిఫోర్నియాలో ఉన్న “అమెరికన్ రిప్రొడక్టివ్ సెంటర్” అనే సంతానోత్పత్తి క్లినిక్ సమీపంలో చోటు చేసుకుంది. ఘటన అనంతరం ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) దీనిని ఉద్దేశపూర్వక ఉగ్రవాద చర్యగా ప్రకటించింది.
పేలుడు తర్వాత ఘటనా స్థలం పొగతో నిండిపోయింది. స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలన మొదలుపెట్టారు. ఈ ఘటనపై స్పందించిన FBI లాస్ ఏంజిల్స్ ఫీల్డ్ ఆఫీస్ అసిస్టెంట్ డైరెక్టర్ అకిల్ డేవిస్, పూర్తి స్థాయి దర్యాప్తు తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.
పోలీసుల ప్రాథమిక విచారణలో పేలుడు క్లినిక్ సమీపంలో నిలిపిన ఓ కారు నుంచి వచ్చిన అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. బాంబు r కారులోనే లేదా దాని చుట్టూ పెట్టి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది విదేశీ ఉగ్రవాద సంఘటనా లేక దేశీయ ఉగ్రవాద చర్యా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.
పేలుడు జరిగిన సమయంలో ప్రజలు ఎక్కువగా ఆ ప్రాంతంలో లేకపోవడం వల్ల ప్రాణనష్టం అంతగా జరగలేదు. అయినప్పటికీ పక్కనున్న అనేక భవనాలు పేలుడు ప్రభావంతో దెబ్బతిన్నాయి