
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామంలో ఒక కుటుంబం పెళ్లి వేడుకలకు సన్నద్ధమవుతోంది. అయితే పెళ్లి రోజు ముహూర్తానికి వధువు కనిపించకుండా పోయింది. విచారణలో ఆమె తన ప్రియుడితో పరారైందని తెలిసింది. పరువు కాపాడుకోవాలని తల్లిదండ్రులు చిన్న కూతురిని వధువుగా మార్చి అదే ముహూర్తానికి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ మైనర్ అని తెలిసి, అధికారులు హస్తక్షేపం చేసి పెళ్లిని నిలిపివేశారు.
హుస్నాబాద్‌కు చెందిన వధువుతో వివాహం నిశ్చయమైన యువకుడికి ఈ పరిణామం షాకిచ్చింది. చివరకు ICDS అధికారులు, పోలీసులు పెళ్లి మండపానికి వచ్చి బాల్యవివాహాన్ని అడ్డుకున్నారు. మైనర్లకు పెళ్లి చేయడం శిక్షార్హమని వివరించారు. ఈ ఘటన రెండు కుటుంబాలకూ మానసిక వేదనను మిగిల్చింది. పోలీసులచే కేసు నమోదు చేసి, పరారైన వధువును గాలిస్తున్నారు.