
తిరుపతి రైల్వే స్టేషన్‌లో భక్తుల కోసం ‘అతిథి’ పేరుతో ఓ ఆధునిక ఏసీ లాంజ్ అందుబాటులోకి వచ్చింది. మొదటి గంటకు రూ.50 + జీఎస్‌టీతో లభించే ఈ లాంజ్, ప్రతి అదనపు గంటకు రూ.50 చొప్పున వసూలు చేస్తుంది. ఇది రోజంతా (24 గంటలు) పనిచేస్తుంది.
ఈ లాంజ్‌లో శీతలీకరణ వ్యవస్థ, వెచ్చని రిక్లైనర్‌లు, విలాసవంతమైన సోఫాలు, శుభ్రమైన వాష్‌రూములు, తినుబండారాలు, పానీయాలు, ఉచిత వై-ఫై, టీవీ, పత్రికలు, మేగజైన్లు తదితర సౌకర్యాలు కలవు. ప్లాట్‌ఫాం నంబర్ 1 వద్ద 350 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ లాంజ్ నిర్మించబడింది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు ఇక్కడ విశ్రాంతి తీసుకోవచ్చు.