ఆగస్టు 16 న .. సైఫ్(Saif Ali khan) పై కత్తిపొట్లతో దాడికి(Attack) పాల్పడిన ఘటన జరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సైఫ్ కుమారుడు.. వెంటనే ఒక ఆటోలో లీలావతి ఆస్పత్రికి తరలించాడు. సదరు ఆటోవాలా(Autowala) కూడా.. రక్తపు మరకలతో ఉన్న వ్యక్తిని జాగ్రత్తగా ఆస్పత్రికి కరెక్ట్ టైమ్ కు తీసుకెళ్లాడు. అతను కనీసం చార్జీలు కూడా తీసుకొలేదు.ఆ తర్వాత అతను సైఫ్ అనే విషయం డ్రైవర్ కి తెలిసిందట . కష్టంలో ఉన్న వ్యక్తిని ఆస్పత్రికి తీసుకెళ్లాలని మాత్రమే ఆ సమయంలో ఆలోచించానని చెప్పాడు ఆటోవాలా . గతంలో ముంబైకి చెందిన ఒక సంస్థ 11 వేల రూపాయల్ని.. సైఫ్ ప్రాణాలు కాపాడిన ఆటోవాలకు రివార్డుగా ఇచ్చింది. ఈరోజు సైఫ్ తన నివాసంలొ.. ఆటో డ్రైవర్ భజన్ సింగ్ ను కలిశారు.ఆయనకు మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. హత్తుకుని చాలా సేపు ఎమోషనల్ అయ్యారు.
తన ప్రాణాలు కాపాడిన ఆటోవాలాను సైఫ్ కలడం పట్ల అభిమానులు..బాలీవుడ్ నటుడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.ఈ ఫొటోస్ ని వైరల్ చేస్తున్నారు.










