Home Entertainment IT Raids In Tollywood : గందరగోళంలో.. టాలీవుడ్?

IT Raids In Tollywood : గందరగోళంలో.. టాలీవుడ్?

pushpa
pushpa

పుష్ప 2(Pushpa-2) సినిమా విడుదల సందర్భంగా.. ప్రీమియర్ షో(Premeire show) టైమ్ లో జరిగిన రచ్చ.. టాలీవుడ్(Tollywood) ను ఓ కుదుపు కుదిపిందనే చెప్పాలి. ఆ ప్రభావం.. మిగతా పెద్ద సినిమాలపై కూడా భారీగా పడిన విషయం అందరికీ తెలుసు. సంధ్య థియేటర్(Sandhya Theater) దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనలో.. ఓ మహిళ చనిపోడవం అన్నది.. ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని(Revanth reddy) కదిలించడం.. ఆ ప్రభావంతో మిగతా సినిమాలకు టికెట్ రేట్ల పెంపు, అదనపు షోలు, బెనిఫిట్ షో లో విషయంలో కత్తెర్లు పడడం.. ఇలా పుష్ప 2 ప్రీమియర్ వివాదం.. చాలా కాలంగా వ్యతిరేక ప్రభావం చూపించింది. ఆ సినిమా తర్వాత.. సంక్రాంతి సీజన్ కు.. గేమ్ ఛేంజర్, డాకూ మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు విడుదలయ్యాయి. ఫలితాలు ఎలా ఉన్నా.. సినిమాల పరంగా ప్రేక్షకులను అలరించాయి. కానీ.. టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం లేకుండా పోవడంతో.. ఆ సినిమాల కలెక్షన్లపై భారీగా ప్రభావం పడింది. ఇక్కడి వరకూ.. ఏకంగా.. సినిమా ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి మధ్య బయటికి కనిపించని ఓ ప్రచ్ఛన్న యుద్ధమే నడిచిన విషయం.. చాలా మంది విశ్లేషకులు గుర్తించారు. కానీ.. అంతా అయిపోయింది.. ప్రస్తుతానికి తొక్కిసలాట విషయం కోర్టులో ఉంది. సినిమా ఇండస్ట్రీ పరంగా ప్రభుత్వం కఠిన చర్యలు అమలు చేసింది. తన నిర్ణయాలను సినీ పెద్దలతో భేటీలో రేవంత్ రెడ్డి తేల్చేశారు.

ఇంత జరిగింది కదా.. మరి ఇప్పుడైనా.. టాలీవుడ్ లో అంతా కుదురుకుందా.. అన్న ప్రశ్న సినీ ఇండస్ట్రీ వ్యాప్తంగా వినిపిస్తోంది. మునుపెన్నడూ లేని రీతిలో.. టాలీవుడ్ నిర్మాతల ఇళ్లపై జరుగుతున్న దాడులు..(IT Raids) కలెక్షన్ల ప్రకటనలకు సంబంధించి విచారణలు.. అన్ని వందల కోట్ల రూపాయలు ఏమైందంటూ ఎంక్వైరీలు.. ఇలా చూస్తుంటే.. ముందు ముందు ఇంకెలాంటి పరిణామాలు జరుగుతాయో అన్న అభిప్రాయాలు.. చాలా మంది నుంచి బహిరంగంగానే వ్యక్తమవుతున్నాయి. ఏకంగా.. తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ అయిన బడా నిర్మాత దిల్ రాజు (Dil Raju)ఇంటిపైనా.. దాడులు జరగడం.. సినీ ఇండస్ట్రీనే కాదు.. సామాన్యులను కూడా కాస్త విస్మయానికి గురి చేసింది. ఇదంతా.. నిజమేనా.. లేదంటే ఇంకేదైనా మతలబు ఉందా.. అన్న కోణంలో జనాల మధ్య చర్చ జరుగుతోంది. మరోవైపు.. మరికొందరేమో.. భారీ సినిమాలు విడుదల సందర్భంగా వందల కోట్ల కలెక్షన్లు వస్తున్నప్పుడు ఇలాంటి దాడులు సహజమే అని చెబుతున్నారు. ఈ విషయాన్ని అంత సీరియస్ గా తీసుకోవాల్సిన పని లేదని అభిప్రాయపడుతున్నారు. మా సినిమాకు అన్ని వందల కోట్లు వచ్చాయి.. ఇన్ని వందల కోట్లు వచ్చాయి.. అని నిర్మాతలు చేసే ప్రకటనల కారణంగానే.. ఇలాంటి దాడులు జరుగుతాయి అన్న వాస్తవాన్ని అంతా గుర్తించాలని కొందరు వాస్తవ విశ్లేషణ కూడా చేసే ప్రయత్నం చేస్తున్నారు.

ఇప్పటికే ఓటీటీ ప్రభావంతో.. టాలీవుడ్ చాలా వరకు నష్టపోతోందన్న అభిప్రాయాలు ఉన్నాయి. దీనికి.. పైరసీ ఎఫెక్ట్ కూడా తోడవుతోంది. పెద్దా చిన్నా తేడా లేకుండా.. ఎలాంటి సినిమా విడుదలైనా సరే.. క్షణాల్లో హెచ్ డీ ప్రింట్ సోషల్ మీడియాలో లభిస్తోంది. పుష్ప 2, గేమ్ ఛేంజర్(Game Changer) వంటి సినిమాల విషయంలో ఇది జరిగింది కూడా. అయినా కూడా.. హీరోలకు ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని.. నిర్మాతలు ఇప్పటికీ చిత్ర నిర్మాణాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఇలాంటి తరుణంలో.. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా తొక్కిసలాట ఘటన జరగడం.. టాలీవుడ్ పై తీవ్రమైన ప్రభావాన్నే చూపింది. చంద్రబాబు ప్రభుత్వ తీరు మాత్రం.. ఏపీలో టాలీవుడ్ కు కాస్త అనుకూలంగానే కనిపిస్తున్నా.. పుష్ప 2 ఘటన ప్రభావంతో.. తెలంగాణలో ఏపీ ప్రభుత్వం మాత్రం కాస్త కఠినంగానే వ్యవహరిస్తున్నట్టుగా స్పష్టమవుతోంది. తాజా పరిణామాలను గమనిస్తే.. ప్రభుత్వ వైఖరిని కూడా ఎంతమాత్రం తప్పుబట్టే పరిస్థితి లేదు. మరోవైపు.. రానున్న కాలంలో భారీ సినిమాలు మరింతగా థియేటర్లలో సందడి చేయనున్నాయి. వాటి విడుదలలోపు.. నటీనటులు, దర్శకులు, నిర్మాతలు అంతా కలిసి.. రేవంత్ ప్రభుత్వంతో మరోసారి చర్చలు చేసి.. తమ సమస్యలు పరిష్కరించుకునేందుకు ప్రయత్నం చేయాల్సిన అవసరమైతే కనిపిస్తోంది. విషయాలు న్యాయ వివాదాలుగా మారుతున్న తరుణంలో.. ముందు జాగ్రత్త చర్యలకు సిద్ధం కాకుంటే.. మరిన్ని భారీ నష్టాలకైనా టాలీవుడ్ సిద్ధం కాక తప్పదన్న సూచనలు.. విశ్లేషకుల నుంచి అందుతున్నాయి.

ఎవరో ఒకరు ఈ విషయంలో బాధ్యత తీసుకోకుంటే.. పరిస్థితిలో అయితే మార్పు రాదు. కానీ.. ఇంతటి తీవ్ర ప్రభావాన్ని ఎదుర్కుని.. సమస్య పరిష్కారానికి అడుగు ముందుకు వేసేది ఎవరు.. అన్న ప్రశ్నకైతే.. ఇప్పట్లో సమాధానం కనిపించే పరిస్థితి టాలీవుడ్ లో అయితే కనిపించడం లేదు. ఇటీవలి ప్రభావాల దృష్ట్యా.. చిరంజీవి మాత్రం ఇలాంటి వివాదాలకు దూరంగానే ఉంటున్నారు. మిగతావారిలో ఎవరూ అంత పెద్దరికాన్ని ప్రదర్శించే పరిస్థితే లేదు. దర్శకులు, నిర్మాతలు, నటీనటుల్లో అయితే.. ఈ విషయంపై ఓపెన్ గా స్పందించే ధైర్యం కూడా కనిపించడం లేదు. అందుకే.. టాలీవుడ్ లో అంతా సెట్ అయినట్టేనా.. అని ఎవరైనా మాట్లాడుకుంటే.. సెట్ కానట్టే.. అని చెప్పుకోవాల్సి వస్తోంది. ఇప్పటికైనా.. ఎవరో ఒకరు ముందుకు వచ్చి.. సినిమా రంగ సమస్యల పరిష్కారానికి సిద్ధం కాకుంటే.. ముందు ముందు పరిస్థితి మరింత చేజారడం ఖాయంగా కనిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here