మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ(Chatrapathi shivaji) మహారాజ్ పెద్ద కొడుకు శంభాజీ మహారాజ్(Shambhaji Maharaj) జీవిత కథ ఆధారంగా తెరకేక్కిన మూవీ ఛవా(Chhaava). విక్కీ కౌశల్(Vickey Kaushal).. శంబాజీ మహారాజ్ పాత్రను పోషించాడు.ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్ వంటివి సినిమాపై క్రియేట్ చేసిన అంచనాలు అన్నీ ఇన్నీ కావు. దానికి తోడు.. పీరియాడిక్ కాన్సెప్ట్ సినిమా అవడంతో ఒక్క హిందీలో మాత్రమే కాదు.. ఇండియాలో అంచనాలు తారా స్థాయికి చేరాయి., తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజైంది. ఛత్రపతి శివాజీ మహరాజ్ మరణానంతరం మరాఠా సామ్రాజ్యానికి శివాజీ కుమారుడు శంభాజీ మహరాజ్రాజుగా నియమితువుతాడు. కాగా, శంభాజీ మహారాజ్‌ను చంపి తన సామ్రాజ్యాన్ని దక్కించుకోవాలని మొగల్ చక్రవర్తి ఔరంగ జేబు చూస్తాడు. ఆయన మీద దండయాత్ర చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది. శంభాజీ మహారాజ్‌ను చిత్ర హింసలు పెట్టారా? శంభాజీ మహారాజ్ నుంచి మరాఠా సామ్రాజ్యాన్ని చేజిక్కించుకున్నారా? అసలు ఏం జరిగింది అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సింది.
ట్రైలర్ మాత్రం ఎక్స్ట్రార్డినరీగా అనిపించింది. విజువల్స్ మాత్రం మైండ్ బ్లోయింగ్‌గా అనిపించాయి. చాలా కాలం తర్వాత పీరియాడిక్ కాన్సెప్ట్ సినిమా వస్తుంది. సినిమాకు కాస్త పాజిటీవ్ టాక్ వచ్చినా.. కలెక్షన్ల మోత మోగిస్తుంది. ఈ సినిమా వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న రిలీజ్ కాబోతుంది.










