కిందినుంచొచ్చా అంటూ.. ఓ సినిమాలో డైలాగ్ చెబుతారు బాలయ్య(Balayya). అలా కింద నుంచి ఒక్కో అడుగు వేస్తూ.. టాలీవుడ్ లో ఎదుగుతూ.. ఆంధ్రా నడి వీధుల్లోకి వచ్చారు. అభిమానుల నట్టింట్లోకి అడుగు పెట్టారు. వారి హృదయ రారాజుగా అంతులేని ప్రేమను సొంతం చేసుకున్నారు. విమర్శలనే విజయానికి సోపానాలుగా మార్చుకున్నారు. కత్తులతో సినిమా తెరలను విజయవంతంగా చించేస్తూ.. సినీ అభిమానులతో నీరాజనాలు అందుకుంటున్నారు. ఒకప్పుడు తను ఎంపిక చేసుకున్న సినిమాలతో విమర్శలపాలైన బాలయ్య బాబు.. మూడు నాలుగేళ్ల నుంచి రూట్ మార్చారు. అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకూ మహారాజ్.. ఇలా దేనికదే విభిన్నమైన కథలు ఎంచుకుంటూ వరుస విజయాలు అందుకుంటున్నారు. బాలయ్య పేరు చెప్పగానే గతంలో నవ్వుకున్న జనాలు కూడా.. ఇప్పుడు జై బాలయ్య అని ప్రేమగా నినదించే స్థానాన్ని ఆయన సొంతం చేసుకున్నారు.
సినిమాలు మాత్రమే కాదు.. ఓటీటీలో(OTT) అన్ స్టాపబుల్(Unstopable) అంటూ ఆయన చేస్తున్న హడావుడి.. సెన్సేషన్ అవుతోంది. ఏ హీరోతో ఎపిసోడ్ చేసినా సరే.. ప్రోమో దశ నుంచే సంచలనాలు సృష్టిస్తోంది. బాలయ్యను హోస్ట్ గా మరో రూపంలో ఆవిష్కరింపజేసిన షో ఇది. సినిమాల పరంగా.. బాలయ్య అన్ స్టాపబుల్ విజయాలు అందుకునే క్రమంలో.. పరోక్షంగా ఈ షో కూడా ఓ కారణం అయ్యిందనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. రీల్ బాలయ్యను చూసి నవ్వుకున్న వాళ్లంతా.. రియల్ బాలయ్య ఇంత జోవియల్ గా ఉంటాడా.. ఆయనలో ఇంత పసి మనసు ఉందా.. అంటూ మరో కోణాన్ని చూశారు. వ్యక్తిగా ఆయన సమాజానికి చేసిన, చేస్తున్న సేవలను కూడా కొన్ని సందర్బాల్లో తెలిసి ఆశ్చర్యానికి గురయ్యారు. ఓవరాల్ గా.. బాలయ్యపై(Nandamuri Balakrishna) ఉన్న పర్సెప్షన్ ను పూర్తిగా మార్చుకుని.. ఆయన్ను అభిమానించే వారి సంఖ్య అయితే.. ఈ షోతో మరింతగా పెరిగిందని కచ్చితంగా చెప్పొచ్చు.
రాజకీయాల్లో(Politica) కూడా రోజుకో మెట్టు ఎదుగుతూ.. ప్రజా సేవలో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంటున్నారు బాలయ్య. హిందూపురం(Hindupuram) శాసనసభ్యుడిగా మూడోసారి ఘన విజయం సాధించారు. అవకాశం ఉంటే మంత్రి కూడా అయ్యేవారు కానీ.. కేబినెట్ లో ఇప్పటికే చంద్రబాబు(Chandrababu), లోకేశ్(Lokesh) ఉన్న కారణంగా.. అదే కుటుంబానికి చెందిన వ్యక్తిగా అవకాశాన్ని అందుకోలేకపోతున్నారు. అయినా.. సందర్భం వచ్చినప్పుడల్లా ఆ ఇద్దరితో తన మనోభావాలు పంచుకుంటూ.. ఓ ప్రజా నాయకుడిగా హిందూపురం నుంచే సేవలు విస్తృతం చేస్తూ వస్తున్నారు. వీటన్నికి తోడు బసవతారకం ఆస్పత్రి నుంచి బాలకృష్ణ చేస్తున్న సేవల గురించి అయితే ఎంత చెప్పినా తక్కువే. నిరుపేద క్యాన్సర్ రోగులకు అండగా నిలుస్తూ.. ఏటా వేలాది మందికి ప్రాణ భిక్ష పెడుతున్నారు. ఓవరాల్ గా.. తండ్రికి తగ్గ తనయుడిగా నిలుస్తూ తెలుగు ప్రజల మనసులు గెలుచుకుంటున్నారు. తన ప్రతిభకు, సేవలకు గుర్తింపుగా ఇప్పుడు భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మభూషణ్ కు ఎంపికై.. మరింత ఉన్నత స్థానాన్ని పొందారు.
ఇలా.. విమర్శలనే తన విజయానికి సోపానాలుగా మార్చుకోవడమే కాదు.. తను నమ్మిన మార్గంలో నడుస్తూ.. తండ్రి నందమూరి తారక రామారావుకు తగ్గ తనయుడిగా ఎదిగి తెలుగు ప్రజలందరితో శభాష్ అనిపించుకుంటున్నారు నటసిహం నందమూరి బాలయ్య. ఆయనకు పద్మభూషణ్ దక్కిన సందర్భంగా.. మీరు ఎలా శుభాకాంక్షలు చెప్పాలని భావిస్తున్నారన్నదీ కామెంట్ సెక్షన్ లో తెలపండి. స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని విశేషాలకు ఐడీ టీవీని సబ్ స్క్రైబ్ చేయండి.