రీసెంట్ గా.. ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంట్లో సంక్రాంతి సంబరాలు జరిగాయి. ప్రధాని మోదీ కూడా వచ్చారు. అక్కడ.. మోదీ కంటే, కిషన్ రెడ్డి కంటే కూడా.. మెగాస్టార్ చిరంజీవి హైలైట్ అయ్యారు. ప్రధాని పక్కనే ఉంటూ.. సంబరాల్లో ఆయన భాగమైన తీరు.. చిరంజీవికి బీజేపీ ఇస్తున్న ప్రాధాన్యాన్ని చెప్పకనే చెప్పింది. అంతకంటే ముందు.. ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరినప్పుడు ప్రధాని కూడా అతిథిగా వచ్చారు. చంద్రబాబును పక్కనబెట్టి మరీ చిరంజీవి దగ్గరికి వెళ్లి.. పవన్ కల్యాణ్(Pawan kalyan), చిరంజీవితో(Chiranjeevi) కలిసి ప్రజలకు ఆయన చేసిన అభివాదం గురించి ఎవరూ మరిచిపోలేరు. అంతగా.. చిరంజీవిని దగ్గరకు తీస్తోంది బీజేపీ నాయకత్వం. ఇప్పుడు ఆయన సరే అంటే చాలు.. అవసరం అనుకుంటే పార్టీ పగ్గాలను కూడా ఏపీలో చిరంజీవి చేతుల్లోనే పెట్టేసే అవకాశం కూడా ఉంది. ఈ పరిణామం ఎదురైతే.. పవన్ కల్యాణ్ కూడా ఏమీ అభ్యంతరం చెప్పకపోవచ్చు. అది గుర్తించిన బీజేపీ.. అవకాశం ఉన్నప్పుడల్లా చిరంజీవిని దగ్గరకు తీస్తూ.. పవన్ మెప్పు పొందుతూ.. ఆ కుటుంబాన్ని తమతోనే కలిసి నడిచేలా జాగ్రత్తలు తీసుకుంటోంది.
ఇప్పటికే ఏపీ బీజేపీలో మహామహులైన నేతలున్నారు. అందులో చాలా మంది వేరే పార్టీల నుంచి వెళ్లి చేరిన వారే. అందులో కూడా.. చంద్రబాబు ప్రభావం ఉన్న నేతలు, పెద్దలు ఎంతోమంది ఉన్నారు. ఇవన్నీ లెక్కలేసుకున్న బీజేపీ(BJP).. బలమైన సామాజిక వర్గానికి చెందిన చిరంజీవి కుటుంబాన్ని చేరదీస్తున్నట్టు కనిపిస్తోంది. పవన్ కల్యాణ్ తో కూడా ఆ కారణంగానే కలిసి అడుగులు వేస్తున్న విషయం స్పష్టమవుతోంది. ఇదే క్రమంలో.. బీజేపీ మరింత దూకుడు చూపించి.. వైసీపీ(YCP) నాయకులను తమ పార్టీలో చేర్చుకునే అవకాశాలున్నాయని పొలిటికల్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే.. విజయసాయి రెడ్డి(Vijay Sai Reddy) లాంటి కీలక వికెట్.. వైసీపీకి దూరమైంది. మరింత మంది.. జగన్(YS Jagan) తీరు నచ్చకనో.. భవిష్యత్ అవసరాలకోసమో.. పార్టీ మారే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఆ వేవ్ ను తమకు అనుకూలంగా మార్చుకుంటే.. వైసీపీ బ్యాచ్ మొత్తాన్ని బీజేపీలో చేర్చుకుంటే.. బలమైన పార్టీగా బీజేపీ ఎదగవచ్చు. ఇదే సమయంలో చిరంజీవిని చేరదీసి.. పార్టీ బాధ్యతలు అప్పజెప్పడమో.. అది కుదరకుంటే ఏదైనా రాష్ట్రానికి గవర్నర్ ను చేయడమో.. అన్నది పరిశీలించవచ్చు. ఇంకా కుదిరితే.. ఏకంగా ఉప రాష్ట్రపతిని చేసి.. దక్షిణ భారతదేశంలో తన పట్టును మరింతగా పెంచుకునే ప్రయత్నం కూడా చేయవచ్చు. ఈ క్రమంలో.. వైసీపీ నుంచి బయటికి వెళ్లే నేతలను తన పార్టీలోకి చేరదీస్తే.. భవిష్యత్తులో వైసీపీని నిర్వీర్యం చేసి బీజేపీలో అనధికారికంగా కలిపేసుకుంటే.. అప్పుడు జనసేన(Janasena) పూర్తిగా బీజేపీతో కలిసి నడిస్తే.. ఏపీలో బలమైన రాజకీయ పక్షాలు రెండే అవుతాయి. పూర్తిగా.. టీడీపీ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా పొలిటికల్ ఈక్వేషన్ మారిపోతుంది. అవసరాన్ని బట్టి.. కలిసి నడవడమా.. లేదంటే రాజకీయంగా కొట్లాడడమా అన్నది.. అప్పటి పరిస్థితిని బట్టి నిర్ణయించుకోవచ్చు.
ఇదే.. ఇప్పుడు బీజేపీ పెద్దల ఆలోచన అయి ఉండవచ్చని.. రాజకీయ విశ్లేషకులు బలంగా చెబుతున్నారు. ఇప్పటికే.. ఉత్తరప్రదేశ్ వంటి బలమైన రాష్ట్రాల్లో బీజేపీ ప్రభావం సన్నగిల్లుతోంది. ఇది మరింత చేజారకుండా జాగ్రత్తపడడంతో పాటు.. దక్షిణ భారతంలో పట్టును పెంచుకుంటే భవిష్యత్తుకు మంచిదని మోదీ, అమిత్ షా ఆలోచన కనిపిస్తోందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అందుకే.. ఏపీపై ఇంతగా ఆలోచన చేస్తూ ఉండవచ్చని కూడా అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో వాస్తవమెంత.. రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ వేదికగా రాజకీయ సమీకరణాలు ఎలా మారనున్నాయి.. వాటిపై మీ అంచనాలు, అభిప్రాయాలు ఏంటి అన్నది.. కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని విశేషాలకు ఐడీ టీవీని సబ్ స్క్రైబ్ చేయండి.