Home Entertainment Janhvi Kapoor : పెళ్లి కోరిక గురించి మాట్లాడిన జాన్వీ కపూర్

Janhvi Kapoor : పెళ్లి కోరిక గురించి మాట్లాడిన జాన్వీ కపూర్

janvi kapoor
janvi kapoor

జాన్వీ కపూర్(Janhvi Kapoor) ఫ్యాన్స్.. హర్ట్ అవుతున్నారు. బుంగమూతి పెడుతున్నారు. ఇంకోసారి అలా మాట్లాడితే బాగోదంటూ.. ప్రేమతో కూడిన వార్నింగ్ ఇస్తున్నారు. అసలు ఎందుకలా మాట్లాడాల్సి వచ్చిందో చెప్పాలంటున్నారు. అసలు విషయం తెలియని వాళ్లంతా.. ఏంటిదంతా అని అయోమయానికి గురవుతున్నారు. అసలు.. జాన్వీకి ఏమైంది.. ఆమె ఏమని మాట్లాడింది.. ఫ్యాన్స్ ఎందుకు హర్ట్ అవుతున్నారు.. అన్నది అర్థం కాక.. విషయాన్ని ఆరా తీస్తున్నారు.

ఇంతకీ.. ఫ్యాన్స్ హర్ట్ అయ్యేంతగా జాన్వీ ఏం మాట్లాడింది.. అందుకు కారణం ఏంటనేది తెలుసుకుందాం. రీసెంట్ గా ఆమె తిరుమలకు(Tirumala) వెళ్లింది. స్వామి వారిని దర్శనం చేసుకుంది. ప్రతి ఏటా తన పుట్టినరోజు నాడు, తన తల్లి శ్రీదేవి(Sri devi) పుట్టినరోజు నాడు తిరుమలకు వెళ్లి వెంకటేశ్వరస్వామిని దర్శనం చేసుకోవడం ఆమెకు అలవాటు. ఏటా క్రమం తప్పకుండా ఇలా స్వామి దర్శనం చేసుకుంటూ భక్తిభావాన్ని చాటుతుంది జాన్వీ. అందుకే.. ఏ ఇంటర్వ్యూలో చూసినా.. పర్సనల్ టాక్స్ లో అయినా.. తిరుమల గురించి ప్రస్తావన వస్తే.. ఆమె చాలా ఆనందంగా ఫీలవుతూ ఉంటుంది. ఓ ఇంటర్వ్యూలో కూడా ఇదే ప్రస్తావన వచ్చింది. తిరుమల అంటే, స్వామివారంటే ఎందుకంత భక్తి.. అని యాంకర్ అడగడంతో.. ఓ రకంగా జాన్వీ ఎమోషనల్ అయిపోయింది.

తనకు పెళ్లి(Marriage) అయిన తర్వాత.. ముగ్గురు పిల్లల్ని కనాలని ఉందని చెప్పిన జాన్వీ.. అంతా కలిసి తిరుపతిలోనే సెటిల్ కావాలని కోరుకుంటున్నట్టు తెలిపింది. తిరుమల సంప్రదాయానికి తగినట్టుగా తన భర్తతో నిత్యం పంచెను కట్టించేందుకు ప్రయత్నిస్తానని కూడా చెప్పింది. తిరుపతిలో ఉంటూ.. వెంకటేశ్వరస్వామిని వీలు కుదిరినప్పుడల్లా దర్శనం చేసుకుంటూ.. అత్యంత సాధారణ జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నట్టుగా తెలిపింది. అరిటాకులో భోజనం చేస్తూ.. నిత్యం గోవిందుడి నామ స్మరణ చేస్తూ.. పిల్లల్ని బాగా చూసుకుంటూ.. తిరుపతిలోనే జీవితాన్ని గడిపేయాలని ఉన్నట్టుగా వివరించింది. తనకు వెంకటేశ్వరస్వామి అంటే అత్యంత భక్తి అని.. అందుకే ఇలాంటి ఆలోచన చేసినట్టు తెలిపింది.

ఇదే.. ఆమె ఫ్యాన్స్ ను కాస్త కంగారు పెట్టించింది. ఇంత చిన్న వయసులో అంత పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దని అభిమానులు జాన్వీకి చెబుతున్నారు. కనీసం పది ఇరవై ఏళ్లు సినిమాలు చేయాలని.. తమను ఇంకా ఇంకా అలరించాలని కోరుతున్నారు. ఆ తర్వాత ఆమెకు నచ్చినట్టుగా తిరుపతిలో సెటిల్ కావాలని సూచిస్తున్నారు. మరికొంత మంది మాత్రం.. స్వామివారిపై తనకున్న భక్తిని చాటుకున్న జాన్వీని అభినందిస్తున్నారు. సంప్రదాయాన్ని ఇంతగా కొనసాగించే మనస్తత్వం ఉండడం.. మంచిదే కదా అని మద్దతిస్తున్నారు. ఆమెకు నచ్చినట్టుగా ఉండడం.. ఆమె హక్కుగా కూడా గుర్తు చేస్తున్నారు. ఈ విషయంలో మీరేమంటారు.. జాన్వీ కామెంట్లపై ఎలా రిప్లై ఇస్తారు అన్నది.. కామెంట్ సెక్షన్ లో తెలపండి. స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని విశేషాల కోసం ఐడీ టీవీని సబ్ స్క్రైబ్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here