రీసెంట్ గా చేసిన సినిమాలు అనుకున్నంత స్థాయిని అందుకోని పరిస్థితుల్లో.. రూట్ మార్చేశారు మెగాస్టార్ చిరు(MEgastar Chiranjeevi). ప్రయోగాలు పక్కనబెట్టి.. మళ్లీ కామెడీ(Comedy Track) రూట్ కు వస్తున్నారు. శ్రీకాంత్ ఓదెలతో(Srikanth Odela) యాక్షన్ సినిమాను అనౌన్స్ చేసినా కూడా.. ముందుగా అనిల్ రావిపూడితో(Anil ravipudi) సినిమాకు ఓకే చెప్పేశారు. ఇప్పుడు సెట్స్ పై ఉన్న విశ్వంభర(Vishwambhara) సినిమాను పూర్తి చేసే లోపు.. అనిల్ రావిపూడిని ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేయాలని చెప్పినట్టు తెలుస్తోంది. అదే జరిగితే.. ఇప్పటివరకూ ఫ్లాప్ అన్న మాటే ఎరుగని అనిల్ రావిపూడి.. చిరంజీవితో మెగా బ్లాక్ బస్టర్ తీయడం ఖాయమని అంతా అనుకుంటున్నారు.
మరోవైపు.. ఫ్యాన్స్ కోరుకుంటున్నట్టుగా కామెడీతో కూడిన థ్రిల్లర్ ను చిరంజీవికి అందించాలని అనిల్ ప్లాన్ చేస్తున్నాడట. ప్రస్తుతానికి అనిల్ చెప్పిన లైన్ చిరుకు విపరీతంగా నచ్చేసిందని.. పూర్తి స్క్రిప్ట్ రెడీ చేసేందుకు కాస్త టైమ్ పడుతుందని అనిల్ రీసెంట్ ఇంటర్వ్యూల్లో చెబుతూ వస్తున్నాడు. అన్నీ కుదిరితే.. విశ్వంభర సినిమాను చిరంజీవి పూర్తి చేయగానే.. అనిల్ రావిపూడి మెగా కామెడీ సినిమా పట్టాలెక్కడం.. దాదాపు ఖాయమే.
ఈ సినిమా తర్వాత.. శ్రీకాంత్ ఓదెలతో సినిమాను పూర్తి చేయనున్నారు చిరు. పేరుకు యాక్షన్ సినిమా అని చెబుతున్నా కూడా.. ఇందులోనూ కామెడీకి ప్రాధాన్యత ఇస్తున్నారట. యాక్షన్ కామెడీగా ఓ డిఫరెంట్ ప్రయత్నాన్ని చేయబోతున్నారట చిరు. అలాగే.. ఈ మూవీ పూర్తయ్యాక.. సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తోనూ సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఆటో జానీ అంటూ.. ఓ పవర్ ఫుల్ స్టోరీని రెడీ చేశారు పూరీ. కానీ.. స్క్రిప్ట్ లో మార్పులకు చిరు పట్టుబట్టారని.. అక్కడే ఆ ప్రాజెక్టు ఆగిపోయిందని అప్పట్లో వార్తలొచ్చాయి. ఇన్నాళ్లకు అదే స్క్రిప్ట్ మళ్లీ పట్టాలెక్కినట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే.. చిరు, పూరీ.. ఈ కాంబినేషన్ పేరుతోనే సినిమా సెన్సేషన్ సృష్టించడం ఖాయమని చెప్పొచ్చు.
ఇలా చెబుతూ పోతే.. వచ్చే మూడు నాలుగేళ్లలో చిరంజీవి నుంచి ఇలాంటి ఎంటర్ టైన్ మెంట్స్ అప్ డేట్స్ మరిన్ని రావచ్చని టాలీవుడ్ లో గుసగుసలు జోరుగా వినిపిస్తున్నాయి. అదే జరిగితే.. మళ్లీ వింటేజ్ చిరు స్టైల్(Vintage Chiru style) ఆఫ్ యాక్టింగ్, డ్యాన్సింగ్, ఫైట్స్, కామెడీ, సెంటిమెంట్ ను మళ్లీ ఎంజాయ్ చేయొచ్చని మెగాభిమానులు ఆరాటపడుతున్నారు. విశ్వంభర పూర్తయ్యేనాటికి ఈ ఇంట్రెస్టింగ్ గాసిప్స్ పై పూర్తి క్లారిటీ వస్తుందని ఆశపడుతున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంటె సెక్షన్ లో తెలపండి. స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని విశేషాలను ఐడీ టీవీని సబ్ స్క్రైబ్ చేయండి.









