2025 మహిళల అండర్-19(Women under-19) టీ20 ప్రపంచకప్‌లో(T-20 World cup) భారత జట్టు ఫైనల్‌కు చేరుకున్నప్పటి నుంచి, లెఫ్ట్-ఆర్మ్ స్పిన్నర్ వైష్ణవి శర్మ(Vaishnavi Sharma) తన అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించింది.
తన స్పిన్ బౌలింగ్‌తో ప్రత్యర్థి జట్లను సమర్థంగా కడగిన ఆమె, భవిష్యత్తులో భారత మహిళా క్రికెట్లో కీలక పాత్ర పోషించే అవకాశాన్ని ఏర్పరచుకుంటున్నది.వైష్ణవి శర్మ తన అండర్-19 టీ20 ప్రపంచకప్‌లో అరంగేట్రం(Debut match) చేసిన రోజు చరిత్ర సృష్టించింది.
మలేషియాపై(Malasiay) తన తొలి మ్యాచ్‌లోనే 5 వికెట్లు తీసి, హ్యాట్రిక్(Hatrick) సాధించిన తొలి భారతీయ స్పిన్నర్‌గా నిలిచింది. భారత కెప్టెన్ నికి ప్రసాద్ ఆమె ఆటను పొగడుతూ, “ఆమె తొలి మ్యాచ్‌లోనే అద్భుతంగా రాణించింది,” అని తెలిపారు.వైష్ణవి ప్రతిభ కొత్తది కాదు. 2022 మహిళల అండర్-19 టీ20 ట్రోఫీ ఫైనల్లో ఆమె కర్ణాటకను ఓడించేందుకు కీలకమైన బౌలింగ్ ప్రదర్శనను ఇచ్చింది.
2022 అండర్-19 టోర్నమెంట్లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా నిలిచిన ఆమెను BCCI ‘జగ్మోహన్ దాల్మియా ట్రోఫీ – ఉత్తమ మహిళా క్రికెటర్’ అవార్డు అందించింది.2023లో, కర్ణాటకతో జరిగిన అండర్-19 టీ20 ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో కూడా వైష్ణవి తన అద్భుత బౌలింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించింది. మిజోరామ్తో జరిగిన మ్యాచ్‌లో ఆమె 22 డాట్ బాల్స్ వేసి, 2 వికెట్లు తీసింది.
2025 అండర్-19 టీ20 ప్రపంచకప్‌లో కూడా, ఆమె 5 మ్యాచ్‌లలో 15 వికెట్లు తీసి, టోర్నీలో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా నిలిచింది. సూపర్ సిక్స్‌లలో బంగ్లాదేశ్‌తో 3-15 బౌలింగ్ చేయగా, సెమీ ఫైనల్లో ఇంగ్లండ్‌పై 3 వికెట్లు తీసి భారత్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించింది.వైష్ణవి శర్మ చిన్నతనంలోనే క్రికెట్‌కు మక్కువ చూపించి, ఐదు సంవత్సరాల వయస్సులో క్రికెట్ శిక్షణ ప్రారంభించింది.
ఆమె స్పిన్ బౌలింగ్‌ను వేగం, నియంత్రణలో రవీంద్ర జడేజాను ఆదర్శంగా తీసుకొని అభివృద్ధి చేసుకుంది.ఇప్పుడు, భారత జట్టు 2025 అండర్-19 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఈ టైటిల్ పోరులో వైష్ణవి కీలక పాత్ర పోషించవచ్చని అంచనాలు ఉన్నాయి. వైష్ణవి శర్మ తన అసాధారణ ప్రతిభతో భారత మహిళల క్రికెట్లో ఒక కొత్త అధ్యాయం ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.