తెలంగాణ రాజకీయాల(TS Politics) నుంచి తప్పుకుని.. ఏపీ పీసీసీ చీఫ్(APPCC) అయ్యాక.. వైఎస్ షర్మిల(YS Sharmila) కాస్త జోరు పెంచారు. సమయానికి తగినట్టుగా విమర్శలు, డిమాండ్లు చేస్తూ తన పార్టీకి మైలేజ్ తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు పార్లమెంట్ సమావేశాల(Parliament sessions) సందర్భాంగా కూడా అదే ప్రయత్నాన్ని చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబును(chandrababu) టార్గెట్ చేశారు. నేను చెప్పింది చెయ్.. లేదంటే ఊరుకునేది లేదు.. ప్రజల ముందు దోషిగా నిలబెడతా అంటూ వార్నింగ్ ఇచ్చారు. ప్రత్యేక హోదా అనేది ఏపీ ప్రజల కల అని గుర్తు చేసిన షర్మిల.. ఈ విషయంలో కేంద్రాన్ని నిలదీయాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీని సైతం ఈ విషయంలో ప్రశ్నించాలన్నారు. కేంద్రం సానుకూలంగా స్పందించకుంటే.. తక్షణమే మద్దతు ఉపసంహరించుకుని ప్రభుత్వం నుంచి బయటికి రావాలని డిమాండ్ చేశారు. అలా చేయకుంటే.. ప్రజల ముందు మరోసారి దోషిగా నిలబెడతానంటూ.. చంద్రబాబును డిమాండ్ చేశారు.. షర్మిల.