రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణపై(SC) ఏర్పాటైన ఏకసభ్య కమిషన్ ఎస్సీ ఉప కులాలను నాలుగు కేటగిరీలుగా విభజించాలని సిఫార్సు చేసినట్లు తెలిసింది. సామా జిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ తదితర రంగాల్లో వెనుకబాటు, ఇతర అంశాలను పరిగ ణనలోకి తీసుకుని ఈ మేరకు నివేదించినట్లు సమాచారం. తొలి కేటగిరీలో అత్యంత వెనుక బడిన ఉప కులాలను, రెండో కేటగిరీలో మాదిగ, మాదిగ ఉపకులాలు, మూడో కేటగి రీలో మాల, మాల ఉపకులాలు, నాలుగో కేటగిరీలో ఇతర ఉప కులాలను చేర్చినట్లు తెలి సింది. ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్ తమ నివేదికను సోమవారం సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ ఉత్తమకుమార్ రెడ్డి(Uthamkumar reddy), వైస్ చైర్మన్ దామోదర్ రాజనర్సింహ, సభ్యులు పొన్నం ప్రభాకర్(Ponnam prabhakar), శ్రీధర్ బాబులకు(Sridhar babu) అందజేశారు.