అల్లు అరవింద్(Allu arvindh) సమర్పణలో వాస్తవ సంఘటనల ఆధారంగా యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య(Nagachaithanya), స్మైలింగ్ బ్యూటీ సాయిపల్లవి(Sai pallavi) జంటగా చందు మొండేటి దర్శకత్వంలో, గీతాఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీవాసు నిర్మించిన చిత్రం తండేల్. భారీ హైప్ తో వచ్చిన ఈ చిత్రం కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది. రిలీజ్ అయిన రెండు రోజులకే ప్రపంచ వ్యాప్తంగా 41.20 కోట్ల రూపాయలను వసూలు చేసిందని మేకర్స్ అధికారికంగా పోస్టర్ ను రిలీజ్ చేశారు. అయితే రిలీజ్ అయిన మొదటి రోజు కంటే రెండవ రోజు ఎక్కువ కాలక్షన్లు రావడం విశేషం. ఇదిలా ఉండగా మూడవ రోజు ఆదివారం కావడంతో అడ్వాన్స్ బుకింగ్స్ కూడ ఎక్కువగా బుక్ అవడంతో బాక్సాఫీస్ దగ్గర మరింత ఎక్కువ కలక్షన్లు వస్తాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఇక సినిమా విషయానికొస్తే శ్రీకాకుళం జిల్లాలోని డి. మత్స్య లేశం గ్రామానికి చెందిన పలువురు మత్స్య కారులు సముద్రంలో చేపల వేటకు వెళ్ళి అక్కడ పాకిస్థాన్ కోస్ట్ గార్డ్ కు చిక్కి జైలు శిక్ష అనుభవించారు, ఆ తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో బయటకు వచ్చారు. ఆ ఘటనను తీసుకొని కల్పిత పాత్రలను జోడించి ఆ చిత్రాన్ని రూపొందించారు. తండేల్ రాజుగా నాగచైతన్య, సత్య గా సాయి పల్లవి అద్బుతంగా నటించారు. ముఖ్యంగా చైతన్య నటన వేరే లెవెల్ అని సినిమా చూసిన వారందరూ చైతన్య పై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. ఇక సంగీతం విషయానికొస్తే పుష్ప హిట్టుతో ఊపు మీద ఉన్న దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఈ చిత్రానికి మరింత హైలెట్ గా నిలిచిందని చెప్పుకోవాలి. లవ్ స్టోరీ లాంటి బ్లాక్ బాస్టర్ తర్వాత నాగచైతన్య, సాయి పల్లవి కలిసి నటించిన ఈ చిత్రం 80 కోట్ల భారీ బడ్జెట్ తో బన్నీ వాసు నిర్మించారు. ఇదే విధంగా కలక్షన్లు కొనసాగితే మొదటి వారం లోనే 100 కోట్ల క్లబ్ లోకి చేరే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మీరు కూడ సినిమాను చూసే ఉంటారు కదా,ఈ మూవీ లో మీకు ఏం నచ్చిందో కామెంట్ చేయండి.