కేంద్ర బడ్జెట్లో(Union Budget) తెలంగాణకు(Telangana) కేటాయింపులే లేవని.. రాష్ట్రాన్ని కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించిన కాంగ్రెస్(Congress) ఎంపీలకు.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala sitaraman).. రాజ్యసభలో సుదీర్ఘంగా సమాధానం ఇచ్చారు. మిగులు బడ్జెట్ తో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని గుర్తు చేశారు. అలాంటి సుసంపన్నమైన రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది తెలంగాణ పాలకులే అని విమర్శించారు. విభజన చట్టాన్ని గౌరవించి కేంద్రం ఎన్నో మంచి పనులు చేసిందని.. తెలంగాణ అభివృద్ధిని ఏనాడూ విస్మరించలేదని స్పష్టం చేశారు. వరంగల్ కు కాకతీయ టెక్స్ టైల్ పార్క్ ఇచ్చాం.. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్ మెంట్ కింద జహీరాబాద్ లో పారిశ్రామిక వాడను కేటాయించాం.. ఇలా కేంద్రం ఎంతగానో తెలంగాణకు అండగా నిలిచింది.. కానీ.. అక్కడి పాలకుల కారణంగానే ఇప్పుడు తీవ్ర అప్పుల్లో కూరుకుపోయింది.. ఇది తెలంగాణ పాలకుల వైఫల్యమే.. అంటూ నాన్ స్టాప్ విమర్శలతో.. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రేణుకాచౌదరిపై విరుచుకుపడ్డారు.. నిర్మల
Watch Video For More Deatils–>










