Home Telangana KCR Political Re-entry : కేసీఆర్ ఈజ్ బ్యాక్.. ఎప్పుడంటే!

KCR Political Re-entry : కేసీఆర్ ఈజ్ బ్యాక్.. ఎప్పుడంటే!

kcr
kcr

కాంగ్రెస్(Congress) నేతలారా.. కాచుకోండి.. కేసీఆర్(KCR) వచ్చేస్తున్నారు.. ఇక మీకు దబిడి దిబిడే అని.. బీఆర్ఎస్(BRS) నేతలంటున్నారు. తమ అధినేత తిరిగి పాలిటిక్స్‏లో(Politics) యాక్టివ్ కాబోతున్నట్టు చెబుతున్నారు. ఈ నెల 19న.. అంటే వచ్చే బుధవారం.. పార్టీ హెడ్ ఆఫీస్ అయిన తెలంగాణ భవన్ లో.. మధ్యాహ్నం పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని కేసీఆర్ నిర్వహించనున్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏర్పాట్లు కూడా చేసేస్తున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులు.. ఇలా కీలక స్థానాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ భేటీకి రానున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తాను చేయబోయే పోరాటాన్ని కేసీఆర్ వారికి వివరించనున్నారని.. బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. టీఆర్ఎస్ ఏర్పడి బీఆర్ఎస్ గా ప్రస్థానం కొనసాగిస్తున్న ఈ 25 ఏళ్ల సందర్భాన్ని ఘనంగా నిర్వహించేందుకే.. ఈ సమావేశమని మరికొందరు అంచనా వేస్తున్నారు. అలాగే.. పార్టీకి ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో.. పునర్వైభవం తీసుకువచ్చే దిశగా కూడా కేసీఆర్ కీలక సూచనలు చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Watch Video For More Deatils–>

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here