Home National & International Rajasingh : బీజేపీని వీడేందుకు సిద్ధమైన రాజాసింగ్?

Rajasingh : బీజేపీని వీడేందుకు సిద్ధమైన రాజాసింగ్?

rajasingh
rajasingh

రాజాసింగ్(Rajasngh). గోషామహల్(Goshmahal) ఎమ్మెల్యే. ఈయన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలంగాణ బీజేపీలో రాజాసింగ్ అంటేనే ఓ ఫైర్ బ్రాండ్ అని అందరికీ తెలుసు. అందరిదీ ఓ దారి అయితే.. ఆయన మాత్రం కాస్త డిఫరెంట్ రూట్ లో వెళ్తారు. తన అభిప్రాయాలపై కచ్చితంగా ఉంటారు. మనసులో ఏదీ దాచుకోకుండా బయటికి కుండబద్ధలు కొట్టినట్టు చెబుతుంటారు. ఇప్పుడు మరోసారి అదే పని చేసి అందరికీ షాక్ ఇచ్చారు రాజాసింగ్. అవసరమైతే తాను పార్టీని వీడేందుకు రెడీ అంటూ సంచలన కామెంట్లు చేశారు. వెళ్లిపో.. అని ఒక్కమాట చెప్పండి చాలు.. మరుక్షణం బీజేపీలో ఉండను.. అని రాజాసింగ్ తేల్చేశారు. పార్టీ గోల్కొండ జిల్లా అధ్యక్ష పదవిని ఎస్సీ, ఎస్టీల్లో ఒకరికి అందించాలని తాను కోరితే.. ఎంఐఎంతో సన్నిహితంగా ఉండే నేతకు ఆ పదవి ఇచ్చారని రాజాసింగ్ ఫుల్ ఫైర్ అయిపోయారు. పార్టీలో సీనియర్ నేతకు ఫోన్ చేసి అడిగితే.. ఆ విషయం ఆయనకు తెలియదని చెప్పారని.. అప్పుడే తనపై పార్టీలో జరుగుతున్న కుట్ర కోణం అర్థమైందని రాజాసింగ్ ఆవేదన చెందారు.
Watch Video For More Deatils–>

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here