తెలంగాణలో(Telangana) స్కూల్ ఫీజుల(School fee) పెంపు పేరెంట్స్‌కు కొత్త మోసంగా మారింది. కొత్త విద్యా సంవత్సరం కోసం ఇప్పటి నుంచే కార్పొరేట్, ప్రైవేట్ స్కూల్ మేనేజ్‌మెంట్లు భారీగా ఫీజులు పెంచుతున్నాయి. ఫీజుల నియంత్రణపై ప్రభుత్వం కొత్త చట్టం తీసుకురాబోతోందన్న ప్రచారంతో, స్కూల్ యాజమాన్యాలు ముందుగానే 15 నుంచి 50 శాతం దాకా ఫీజులను పెంచుతున్నాయి.
హైదరాబాద్(Hyderabad) హయత్‌నగర్‌లోని జీ హైస్కూల్ ఒక్కసారిగా 40 శాతం ఫీజులు పెంచడంతో పేరెంట్స్ ఆందోళనకు దిగారు. స్కూల్ యాజమాన్యంపై నినాదాలు చేస్తూ,ఈ పెంపును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. స్కూల్ యాజమాన్యాలు పేరెంట్స్‌పై ఒత్తిడి తెస్తూ, ముందుగా 25 శాతం ఫీజు కట్టాలని బలవంతం చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు.
For more details watch video–>










