ఇటీవల తండేల్(Thandel) ప్రీ రిలీజ్ ఈవెంట్ లో(Pre-release) అల్లు అరవింద్చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. దిల్ రాజును స్టేజి మీదకి ఆహ్వానిస్తూ.. వారం రోజుల్లోనే హిట్టు, ఫ్లాపు, ఐటీ రైడ్స్(IT Raids) అన్నీ చూశాడు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దూమరాన్నే సృష్టించాయి. ఓ సినిమాను ఇలా.. ఓ సినిమాను అలా అంటూ గేమ్ ఛేంజర్(Game changer) సినిమాపై సెటైర్లు వేశారని, అల్లు అరవింద్ పై ఓ వర్గం అభిమానులు విపరీతంగా ట్రోల్ చేశారు. మెగా అభిమానులు(Mega fans) అల్లు అరవింద్ వ్యాఖ్యలకు విరుచుకుపడ్డారు. తాజాగా ఈ విషయంపై మెగా నిర్మాత వివరణ ఇచ్చారు. రామ్ చరణ్(Ram charan) ఆయనకు కొడుకు లాంటివాడని, ఆయనకు ఉన్న ఒకే ఒక మేనల్లుడని, అతనికి ఉన్న ఒకే ఒక మేనమామ ఆయన అంటూ వారిద్దరి మధ్య అనుబంధం ఎప్పుడు ఆరోగ్యకరంగానే ఉంటుందని స్పష్టం చేశారు. అనుకోకుండా అన్న మాటే కానీ.. ఉద్దేశపూర్వకంగా అనలేదని వారి మధ్య అపార్థాలు సృష్టించవద్దని నెటిజన్లను కోరారు.