స్థానిక సంస్థల ఎన్నికలకు(Local Body Elections) వారం రోజుల్లోనే షెడ్యూల్ రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తున్నది. బీసీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ తన రిపోర్ట్‌ను సోమవారం ప్రభుత్వానికి అందజేసింది.
ఈ రిపోర్ట్‌ను కేబినెట్ ఆమోదించి.. జిల్లాల కలెక్టర్లకు పంపించనుంది. కలెక్టర్లు నివేదికను క్షుణ్ణంగా పరిశీలించి గ్రామాలవారీగా వార్డులకు.. మండలాలవా రీగా సర్పంచ్ లకు, ఎంపీటీసీ స్థానాలకు.. జిల్లాల వారీగా ఎంపీపీ, జెడ్పీటీసీస్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. అనంతరం దాన్ని పంచాయతీరాజ్ శాఖకుపంపుతారు.
ఈ ప్రాసెస్ పూర్తవగానే రిజర్వేషన్లపై గెజిట్ విడుదలవుతుంది. ఆ తర్వాత గెజిట్‌ను స్టేట్ ఎలక్షన్ కమిషన్ కు పంపిస్తే.. వెనువెంటనే స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. కాగా, ఈ ప్రక్రియంతా వారంలోపే పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది.