పౌరసరఫరాల శాఖ ఆదేశాలతో ఈ నెల 7వ తేదీ అర్ధరాత్రి నుంచే ‘మీ సేవ’(Mee seva) వెబ్‌సైట్‌లో రేషన్‌కార్డుల(Ration card) దరఖాస్తుల(Application) స్వీకరణ ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. అయితే, 8వ తేదీ ఉదయం వెబ్‌సైట్ నుంచి కనుమారుగైంది. దీంతో దరఖాస్తు దారుల్లో ఆందోళన నెలకొంది.
ఈ నేపథ్యంలో తాజాగా మరోమారు సమావేశమైన పౌరసరఫరాల శాఖ అధికారులు రేషన్‌కార్డుల జారీపై మరింత లోతుగా చర్చించారు. ప్రజావాణి కార్యక్రమంలో ఇప్పటికే రేషన్‌కార్డులకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించడం, క్యాబినెట్ నిర్ణయం కూడా ముందే జరగడంతో కార్డుల జారీకి సాంకేతికంగా ఎలాంటి సమస్య రాదన్న ఉద్దేశంతో దరఖాస్తులు స్వీకరించాలని మరోమారు ఆదేశించారు. దీంతో నిన్న సాయంత్రం నుంచి ‘మీ సేవ’ కేంద్రాల్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది.
ఇప్పటికే ప్రజాపాలన, కులగణన, ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన పనిలేదని, వాటి పరిశీలన ఇప్పటికే మొదలైందని అధికారులు తెలిపారు.










