నేడు గురు రవిదాస్(Guru Ravidas) 648వ జయంతి. గురు రవిదాస్ జయంతి(Guru Ravidas Jayanthi) హిందూ క్యాలెండర్ ప్రకారం మాఘ మాసంలో పౌర్ణమి రోజు జరుగుతుంది. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం, ఈ పండుగ ఫిబ్రవరి నెలలో వస్తుంది. రవిదాస్ మతం యొక్క నమ్మకాలు మరియు సిద్ధాంతాలను విశ్వసించే వారికి గురు రవిదాస్ జయంతి పండుగ చాలా ముఖ్యమైనది.
భక్తి ఉద్యమంలో(Spiritual revolution) గురు రవిదాస్ ప్రఖ్యాత వ్యక్తి. ఆయనను గురు రవిదాస్, సంత్ రవిదాస్, భగత్ రవిదాస్ వంటి పేర్లతో కూడా పిలుస్తారు. రవి దాస్ ఆయన జీవితంలో సంత్ రవిదాస్ సమానత్వం, మానవ హక్కులను బోధించేవారు. ఆయన ఒక సాధువు, కవి మరియు తత్వవేత్త. గురు రవిదాస్ 15వ శతాబ్దంలో ప్రసిద్ద భారతీయ కవి, సాధువు మరియు ఆధ్యాత్మిక నాయకుడు. భక్తి ఉద్యమానికి ఆయన చేసిన కృషి నేటి వరకు గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఆయన బోధనలు కుల వివక్షను అధిగమించి ఆధ్యాత్మిక వృద్ధి, ధర్మమార్గంలో ప్రయాణించడానికి ప్రజలను ప్రేరేపించాయి.
గురు రవిదాస్ జయంతి ఉత్తర భారతదేశం మరియు పంజాబ్‌లలో(Punjab) చాలా ముఖ్యమైనది. ఆయన జయంతి రోజున ప్రార్థనలు, ఊరేగింపులు, వేడుకలు జరుపుకుంటారు. గురువు పుట్టినరోజును జరుపుకోవడానికి అమృతబని గురు రవిదాస్ ని చదువుతారు. ప్రత్యేక హారతి నిర్వహిస్తూ, నగర కీర్తనను వీధుల్లోకి తీసుకువెళతారు. ఆయన జయంతి వేడుకల్లో భాగంగా నదిలో స్నానం చేయడానికి వందలాది మంది భక్తులు ఒకచోట చేరతారు.
గురువును మరియు ఆయన బోధనలను మననం చేసుకునేందుకు, వారణాసిలోని సీర్ గోవర్ధన్‌పూర్‌లోని శ్రీ గురు రవిదాస్ జనమ్ ఆస్థాన్ మందిర్‌లో వేడుకలు జరుపుతారు. గురువు పుట్టినరోజును జరుపుకోవడానికి దేశం నలుమూలల నుండి భక్తులు తరలివస్తారు.










