న్యాయవాది అశ్వినీ కుమార్(Ashwin kumar) ఉపాధ్యాయ 2016లో ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 8, 9 సెక్షన్ల రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం సోమవారం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. దీనిపై జస్టిస్ దీపాం కర్ దత్తా, జస్టిస్ మన్మోహన్ తో కూడిన ధర్మాసనం విచారణ జరపగా. ఏదైనా క్రిమినల్ కేసులో దోషిగా తేలినవారు అసలు చట్టసభలకు ఎలా తిరిగి వస్తారని ప్రశ్నించింది.
నేరాలకు పాల్పడి శిక్ష పడ్డ రాజకీయ నేతలు(Criminal politicians) చట్టసభల్లో పోటీ చేయకుండా శాశ్వతంగా నిషేధం విధించడంపై మూడు వారాల్లోగా అభిప్రాయాన్ని తెలపాలంటూ సుప్రీంకోర్టు కేంద్రాన్ని, ఎన్నికల కమిషన్ ను ఆదేశించింది. రాజకీయాలు నేరమయం కావడం తీవ్రమైన అంశమని ఆందోళన వ్యక్తం చేసింది .
ఒక ప్రభుత్వ ఉద్యోగి అవినీతికి పాల్పడినట్టు తేలినా, ప్రభుత్వానికి అవిధేయుడుగా ఉన్నట్టు తేలినా ఆ వ్యక్తిని సర్వీసులో కొనసాగడానికి అనర్హుడిగా భావిస్తారని.. కానీ, అదే వ్యక్తి మంత్రిగా కొనసాగడం ఆశ్చర్యం కలిగించే విషయమని, నేరచరిత్ర ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలను శాశ్వతంగా చట్టసభల్లో ప్రవేశించకుండా వేటువేయాలనే ప్రతిపాదనపై కేంద్రం, ఎన్నికల కమిషన్ స్పందించాలని కోరింది.