Home Andhra Pradesh Amaravati 2.0 Begins!:చంద్రబాబు విజన్ మెగా సిటీ!

Amaravati 2.0 Begins!:చంద్రబాబు విజన్ మెగా సిటీ!

chandrababu naidu
chandrababu naidu

హైటెక్ ముఖ్యమంత్రి చంద్రబాబు(Chief Minister Chandrababu).. ఏం చేసినా సంచలనమే. ఆయన ఓ నిర్ణయాన్ని తీసుకున్నారంటే చాలు.. క్షణాల్లో వరల్డ్ వైడ్ గా వైరల్ అయిపోతుంటుంది. 2014లో నవ్యాంధ్ర రాజధానిగా అమరావతిని(Amaravati) ప్రకటించినప్పుడు కూడా ఇలాగే.. పెను సంచలనమైంది. తర్వాత ప్రభుత్వం మారడం.. 3 రాజధానుల ప్రతిపాదన రావడంతో.. అమరావతి అభివృద్ధి అటకెక్కింది. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. మరోసారి అమరావతి రయ్ మంటూ దూసుకెళ్తోంది. ఇది ఆరంభం మాత్రమే అంటూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రకటన ఇప్పుడు సంచలనంగా మారింది. అమరావతి విషయంలో ఆయన వేయబోతున్న తర్వాత అడుగుపైనే.. అందరి దృష్టి నెలకొంది.

1996లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత.. అప్పటికే అభివృద్ధి చెంది ఉన్న హైదరాబాద్ ను మరింతగా అప్ గ్రేడ్ చేశారు చంద్రబాబు. సైబరాబాద్ సిటీని అందుబాటులోకి తెచ్చి.. ఐటీ రంగానికి కేరాఫ్ గా హైదరాబాద్ ను నిలబెట్టారు. అందుకే.. ప్రపంచపటంలో హైదరాబాద్ కు చోటు కల్పించింది నేనే.. అంటూ ఆయన పదే పదే గర్వంగా చెబుతూ ఉంటారు. అలాంటి మరో సిటీకి.. ఇంకా చెప్పాలంటే.. తెలంగాణలోని హైటెక్ సిటీని(Hi-Tech City) మించేలా.. ఆంధ్రప్రదేశ్ లో మెగా సిటీకి రూపకల్పన చేసి.. మరో భారీ సంచలనానికి నాంది పలికారు.. చంద్రబాబు. ఇప్పటికే అభివృద్ధి చెందిన విజయవాడ, గుంటూరుతో.. రాజధాని అమరావతిని కలిపి మెగా సిటీ నిర్మించే ప్లాన్ కు ఆయన సిద్ధమయ్యారు.

ఈ మెగాసిటీలో.. విజయవాడ, గుంటూరు, అమరావతితో(Vijayawada, Guntur and Amaravati) పాటుగా.. మంగళగిరి, తాడేపల్లిని(Mangalagiri and Tadepalli) కూడా కలపనున్నట్టుగా ఏపీ అధికార వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. శంషాబాద్ ను మించిన భారీ స్థాయిలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అవసరమైన భూ సమీకరణకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. మెగా సిటీ మాస్టర్ ప్లాన్ కు.. కనీసం 5 వేల ఎకరాల మేర ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కావాలని.. మంత్రి నారాయణ కూడా చెప్పారు. అవసరమైన భూమిని పరిశీలించాలని సీఎం ఆదేశించినట్టు తెలిపారు. అలాగే.. రాజధాని నిర్మాణానికి తీసుకున్న భూముల్లో.. ఏడాదిలోపు ప్రణాళిక ప్రకారంగా భవనాల నిర్మాణం పూర్తవుతుందని, అవసరమైన వాటికి టెండర్లు కూడా పిలిచామని చెప్పారు.

మంత్రి నారాయణ చెప్పిన మాటలతో.. చాలా మంది ఒక్కసారిగా 1996 నాటి రోజులు గుర్తు చేసుకుంటున్నారు. విజన్ 2020 పేరుతో చంద్రబాబు హైదరాబాద్ ను చేసిన అభివృద్ధిపై ఆయన అభిమానులు, టీడీపీ నేతలు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు విజన్ మెగాసిటీతో చంద్రబాబు ఇంకెంత సంచలనాన్ని సృష్టించబోతున్నారో అంటూ ఎదురుచూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here