Home Andhra Pradesh Pawan Kalyan’s Love for Classical Music :పవన్ కళ్యాణ్ సంగీతాభిరుచి: ఆనంద్ సాయి చెప్పిన...

Pawan Kalyan’s Love for Classical Music :పవన్ కళ్యాణ్ సంగీతాభిరుచి: ఆనంద్ సాయి చెప్పిన అరుదైన విషయాలు

Pawan Kalyan, JanaSena Party, Andhra Pradesh Deputy CM, Mark Shankar Pawanovich, Anand Sai, Pawan Kalyan music taste, Ghantasala songs, M. S. Subbulakshmi, Sirkazhi Govindarajan, Soolamangalam Sisters, MGR songs, Pawan Kalyan Chennai memories, Pawan Kalyan devotional songs, Pawan Kalyan classical music, Pawan Kalyan old songs
Pawan Kalyan, JanaSena Party, Andhra Pradesh Deputy CM, Mark Shankar Pawanovich, Anand Sai, Pawan Kalyan music taste, Ghantasala songs, M. S. Subbulakshmi, Sirkazhi Govindarajan, Soolamangalam Sisters, MGR songs, Pawan Kalyan Chennai memories, Pawan Kalyan devotional songs, Pawan Kalyan classical music, Pawan Kalyan old songs

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) – ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రిగా, జనసేన పార్టీ (JanaSena Party) అధినేతగా, సినిమా హీరోగా, ఓ కుటుంబ పెద్దగా విభిన్న రోల్స్ పోషిస్తూ ప్రస్తుతం బిజీగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌కి ఉప ముఖ్యమంత్రి అయ్యాక ఆయనకు టైమ్ చాలా తక్కువ అయిపోయింది. అన్ని వ్యవహారాలూ చక్కబెట్టుకునేందుకు 24 గంటలు సరిపోక తలెత్తుతోంది.

ఇటీవల ఆయన చిన్న కొడుకు మార్క్ శంకర్ పవనోవిచ్ (Mark Shankar Pawanovich) ఒక అగ్ని ప్రమాదానికి గురైన విషయమైతే తెలిసింది. కానీ అప్పటికే షెడ్యూల్ అయిన ప్రభుత్వ కార్యక్రమాలను పూర్తిచేసుకుని పవన్ సింగపూర్ (Singapore) వెళ్లాల్సి వచ్చింది. ఇంత బిజీగా ఉన్నా, ఆయనకు దొరికే చిన్న ఖాళీ సమయాల్లో ఏం చేస్తారో, ఏ పాటలు వింటారో తెలుసా? ఈ ఇంట్రెస్టింగ్ విషయాన్ని అందరితో పంచుకున్నారు ఆయన స్నేహితుడు, ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి (Anand Sai).

ఆనంద్ సాయికి ఏ ఇంటర్వ్యూకైనా వెళ్లినా పవన్ గురించి, వారి స్నేహం గురించి తప్పనిసరిగా ప్రశ్నలు వస్తుంటాయి. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ కి ఉన్న సంగీతాభిరుచి గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఖాళీ సమయాల్లో పవన్ ఎక్కువగా ఘంటసాల (Ghantasala) పాత పాటలు, ఎంఎస్ సుబ్బలక్ష్మి (M. S. Subbulakshmi) కర్ణాటక సంగీత కీర్తనలు, సిర్కాజి గోవిందరాజన్ (Sirkazhi Govindarajan), సూలమంగళం సిస్టర్స్ (Soolamangalam Sisters) వంటి గాయకుల పాటలు వింటారని చెప్పారు. అంతేకాదు, తమిళనాడులోని అగ్రహీరో అయిన ఎంజీ రామచంద్రన్ (M. G. Ramachandran / MGR) పాటలంటే పవన్‌కు చాలా ఇష్టమని తెలిపారు.

తమ చెన్నై (Chennai) రోజులను గుర్తు చేసుకున్న ఆనంద్ సాయి, “ఆ రోజుల్లో ఇద్దరం కలిసి పాటలు వింటూ కాలం గడిపే వాళ్లం. చెన్నై వీధుల్లోని దేవాలయాల చుట్టూ తిరుగుతూ అక్కడ విన్న పాటల మాధుర్యాన్ని మర్చిపోలేను,” అన్నారు. అప్పట్లో సినిమా పాటల పుస్తకాలు వచ్చేవని, వాటిని కొనుక్కుని గదిలో కూర్చొని పాడుకునేవాళ్లమని చెప్పారు. పవన్‌కు అలా పాత పాటల పుస్తకాలు సేకరించడం కూడా చాలా ఆసక్తిగా ఉండేదని వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here