తమిళనాడులో.. తమిళ వెట్రి కజగం పార్టీ పెట్టి(Tamilaga Vettri Kazhagam) జనాల్లోకి వచ్చిన స్టార్ హీరో విజయ్‌కు(Vijay thalapathy).. భద్రత పెంచింది కేంద్రం. గత ఏడాది రాజకీయాల్లోకి వచ్చి జనాల్లోకి విస్తృతంగా వెళ్తున్న ఆయనకు.. కేంద్రం వై ప్లస్ కేటగిరీ భద్రత(Y+ Security) కల్పించింది. ఈ మేరకు కేంద్ర హోం వ్యవహారాల శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి వచ్చిన సమాచారం మేరకు.. విజయ్ కు ప్రాణాపాయం ఉందని నిర్థారించుకున్న తర్వాతే.. కేంద్ర హోం శాఖ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సాధారణంగా.. భారత ప్రభుత్వం.. ప్రముఖులకు భద్రత కల్పించే విషయంలో కొన్ని కీలక విషయాలను పరిగణనలోకి తీసుకుంటుంది. ముప్పు స్థాయి ఎంత ఉంది.. ఆ విషయంలో నిఘా వర్గాలు ఏం చెబుతున్నాయి అన్నది.. ఈ నిర్ణయంలో కీలకంగా వ్యవహరిస్తాయి.
విజయ్ కు అందిన వై ప్లస్ సెక్యురిటీ.. దేశంలోనే అత్యున్నత నాలుగో స్థాయి భద్రత అని అధికార వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా 11 మంది భద్రతా సిబ్బంది.. ఇకపై కంటికి రెప్పలా విజయ్ ను కాపాడుతారని తెలిపాయి. ఈ పదకొండు మంది సిబ్బందిలో నలుగురు కమాండోలు ఉంటారు. విజయ్ చుట్టూ ఈగ వాలినా కూడా వాళ్లు వదలరు. మిగిలన ఏడుగురు.. పోలీస్ సిబ్బంది ఉంటారు. విజయ్ ఎక్కడికి వెళ్లినా.. ఏ సమావేశంలో పాల్గొన్నా.. చుట్టూ ఉండే పరిసరాల్లో ఆయన భద్రతను పర్యవేక్షిస్తుంటారు. ఏ మాత్రం అనుమానం వచ్చినా.. వెంటనే కఠినంగా వ్యవహరించి.. ఆయనకు అపాయం లేకుండా జాగ్రత్త పడతారు.
Watch Video For More Details—>