Home Telangana Revanth Reddy : కులగణనపై.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Revanth Reddy : కులగణనపై.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు

revanth reddy
revanth reddy

హైదరాబాద్ లోని గాంధీ భవన్‎లో(Gandhi Bhavan).. కులగణనపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth reddy) కులగణనపై తన ఉద్దేశాన్ని కుండబద్ధలు కొట్టారు. తాను ఆఖరి రెడ్డి సీఎంను అయినా పర్వాలేదు కానీ.. బీసీల లెక్కలు మాత్రం కచ్చితంగా తేల్చాలన్న లక్ష్యంతోనే కుల గణన నిర్వహిస్తున్నామని చెప్పారు. తన నాయకుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు.. క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్(Congress) కార్యకర్తగా ఈ బాధ్యత తీసుకున్నట్టు వివరించారు. కులాల లెక్కలను పక్కాగా తేల్చామని చెప్పిన ఆయన.. ఏ పదవి కోసమో.. మరోదో లాభం కోసమో ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించలేదని స్పష్టం చేశారు. విపక్షాల ఆరోపణల్లో వాస్తవం లేదని.. కులగణనలో ఎలాంటి పొరబాట్లకూ తావు లేకుండా.. ప్రక్రియను పూర్తి చేస్తున్నామని చెప్పారు.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ సర్వేపై.. ప్రతిపక్ష బీఆర్ఎస్(BRS) నేతలు చేస్తున్న విమర్శలను రేవంత్ తప్పుబట్టారు. వారి ఇళ్ల ముందు మేలుకొలుపు డప్పు కొట్టాలంటూ బీసీ సంఘాలకు విజ్ఞప్తి చేశారు. కేసీఆర్(KCR), కేటీఆర్(KTR), హరీష్ రావ్(Harish Rao) వంటి నేతల ఇళ్ల ముందు డప్పుకొట్టాలన్నారు. అలాగే.. ప్రధాని మోదీని కూడా రేవంత్ వదల్లేదు. అసలు మోదీ బీసీనే కాదని.. వ్యక్తిత్వంలో ఆయన ఓసీ అని.. గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యాకే సర్టిఫికెట్ లో బీసీగా మార్చుకున్నారని ఆరోపించారు. అక్కడితో ఆగకుండా.. సామాన్య జనాలకు కూడా ఇన్ డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చారు.. రేవంత్ రెడ్డి. రెండో సారి నిర్వహిస్తున్న కులగణనను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మొదటి విడతలో అవకాశం దక్కని వాళ్ల కోసమే రెండో విడత కులగణన నిర్వహిస్తున్నామన్నారు. ఈ సర్వేలో భాగం కాని వారికి సామాజిక బహిష్కరణే శిక్ష అని సంచలన రీతిలో అందరినీ హెచ్చరించారు.. రేవంత్ రెడ్డి.

Watch Video Foe More Details—>

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here