హిందూ మతంలోని అత్యంత ప్రాచీన గ్రంథాలలో ఒకటైన గరుడ పురాణం, జననం, మరణం మరియు ఆత్మ మరణానంతర ప్రయాణం వంటి విషయాలను విశదీకరిస్తుంది. ఇందులో, విష్ణుమూర్తి మరియు పక్షీరాజు గరుడుని మధ్య సంభాషణ రూపంలో ఉన్న విషయాలు ప్రస్తావించబడతాయి. ఈ పురాణం ప్రకారం, మనుషులు తమ కర్మల ఆధారంగా స్వర్గం, నరకం లేదా మోక్షాన్ని పొందుతారు. ప్రతి వ్యక్తీ తన కర్మ ఫలితాన్ని అనుభవించాల్సిందే. మంచి పని చేసినవారికి మంచి ఫలితం, చెడు పని చేసినవారికి చెడు ఫలితం లభిస్తుంది.
గరుడ పురాణం ప్రకారం, జీవితాంతం చెడు క్రియలతో గడిపిన పురుషులు మరియు స్త్రీలు మరణానంతరం నరకయాతన అనుభవించాల్సి ఉంటుంది. అనంతరం, వారు విషపూరిత, వింత జీవుల రూపంలో తిరిగి జన్మిస్తారు.
స్త్రీలపై లైంగిక దోపిడీ చేసే వ్యక్తులు మరణించిన తర్వాత నరకంలో కఠిన శిక్షలను అనుభవించాలి. వారి ఆత్మ తదుపరి జన్మలో కొండచిలువగా పుడుతుంది. అలాగే, గురువు భార్యతో శారీరక సంబంధం కలిగినవారు తాము మానవ జన్మ కోల్పోయి తొండ రూపంలో పుడతారు.
స్నేహితుడి భార్యపై దృష్టి పెట్టే లేదా సంబంధం పెట్టుకునే పురుషులు నరకంలో తీవ్రమైన హింసకు గురై, అనంతరం గాడిదగా జన్మిస్తారు. స్త్రీలను గౌరవించని, వారిని హింసించే పురుషులు నరకానుభవించడంతో పాటు, తదుపరి జన్మలో నపుంసకుడిగా పుడతారు.
ఇదే విధంగా, వివాహిత స్త్రీలు పరాయి పురుషులతో సంబంధం పెట్టుకున్నట్లయితే, నరకంలో హింస అనుభవించి, తరువాత జన్మలో బల్లి, పాము లేదా గబ్బిలంగా జన్మిస్తారు.
ఈ విధమైన దుర్గతి నుండి తప్పించుకోవాలంటే, ఆ జీవులు కొత్త జన్మలో మంచిపనులు చేస్తూ పాపాలను నీవారించాలి. మంచి కర్మల ద్వారానే మానవ జన్మను తిరిగి పొందగలుగుతారు లేదా మోక్షాన్ని సాధించవచ్చు.
గమనిక: పై సమాచారం మతపరమైన విశ్వాసాల ఆధారంగా రూపొందించబడింది. ఇవి పండితుల అభిప్రాయాలు మరియు పురాణ కథనాలపై ఆధారపడి ఉన్నాయి. శాస్త్రీయంగా నిరూపితమైన విషయాలు కావని పాఠకులు గుర్తించాలి.