
హిందూ మతం ప్రకారం, కర్మ ఫలాలను ప్రసాదించే శనిదేవుని ఆరాధించడం వల్ల జీవితంలో శుభ ఫలితాలు కలుగుతాయని విశ్వసించబడుతుంది. శని గ్రహ ప్రభావం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు లేదా శని దోషం బాధపడుతున్నవారు కొన్ని ముఖ్యమైన పరిహారాలను అనుసరించడం వల్ల శనిశ్వరుని అనుగ్రహాన్ని పొందగలుగుతారు. ఈ పరిహారాల వల్ల శనిదేవుని దయతో పాటు లక్ష్మీదేవి ఆశీస్సులు కూడా లభిస్తాయని నమ్మకం.
శనిదేవుడు “కర్మఫలదాత”గా ప్రసిద్ధుడు. మనిషి చేసిన పనుల ఆధారంగా శుభ లేదా అశుభ ఫలితాలు ఇవ్వడం ఆయనే చేస్తాడు. ఆయన కోపాన్ని తగ్గించేందుకు కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు చేయడం శ్రేయస్కరం. మంచి కార్యాలు చేస్తూ ధర్మబద్ధంగా జీవిస్తే శనిదేవుని కోపం నుంచి రక్షణ లభించడంతో పాటు, ధన లక్ష్మీ ఆశీర్వాదం కూడా కలుగుతుంది.
శనిదేవుని అనుగ్రహం పొందేందుకు చేసే ముఖ్యమైన పరిహారాలు:
రావి చెట్టు పూజ:
హిందూ సంప్రదాయాల ప్రకారం, రావి చెట్టులో అనేక దేవతలు నివసిస్తారని నమ్ముతారు. ప్రతి రోజు రావి చెట్టు కింద నెయ్యితో దీపం వెలిగించడం మంచిదని చెబుతారు. అదే విధంగా, ఇనుప పాత్రలో నీరు, పాలు, నెయ్యి, చక్కెర కలిపి రావి చెట్టుకి సమర్పించడం వల్ల శనిశ్వరుని అనుగ్రహం పొందవచ్చని విశ్వాసం.
హనుమంతుని ఆరాధన:
శనిదేవునితో పాటు హనుమంతుని పూజించడం వల్ల శని దోష ప్రభావం తగ్గుతుందని భావించబడుతుంది. శనివారాలు శనిశ్వరుని ఆలయానికి వెళ్లి ఆవు నూనెతో దీపం వెలిగించడం శుభఫలితాలను అందిస్తుంది.
నల్ల ఆవును సేవించడం:
నల్ల ఆవుకి పూజ చేయడం కూడా శని దోష నివారణకు ఒక శక్తివంతమైన పరిహారంగా చెప్పబడుతోంది. ఆవుకి కుంకుమ పెట్టి, దారం కట్టి, ధూపం వెలిగించి పూజ చేయడం వల్ల శనిశ్వరుని అనుగ్రహం వెంటనే లభిస్తుందని నమ్ముతారు. దీని ఫలితంగా లక్ష్మీదేవి అనుగ్రహంతో సంపద, సంతోషం లభిస్తాయని విశ్వసించబడుతుంది.
గమనిక:
పై వివరాలు ప్రధానంగా మతపరమైన విశ్వాసాలపై ఆధారపడినవి. పండితుల సూచనలు, సంప్రదాయ ప్రమాణాల ఆధారంగా ఈ సమాచారం అందించబడింది. శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చు కాబట్టి, పాఠకులు తమ మానసిక నమ్మకాల మేరకు దీనిని అనుసరించవచ్చు.