వివిధ కేసుల్లో ఇప్పటికే అరెస్ట్ జారీ అయిన బీఆర్ఎస్ సీనియర్ నేత, బోధన్ మాజీ ఎమ్మెల్యే (Bodhan MLA) షకీల్ (Shakeel) ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అరెస్ట్ భయంతోనే ఆయన కొన్ని నెలలుగా దుబాయ్ లో ఉంటున్నారని.. తల్లి చనిపోవడంతోవారెంట్లు అంత్యక్రియల కోసం బోధన్ కు వెళ్లడం కోసం దుబాయ్ నుంచి హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చారని.. సమాచారం అందుకున్న పోలీసులు మాటు వేసి మరీ.. షకీల్ ను తమ ఆధీనంలోకి తీసుకున్నారని సమాచారం అందుతోంది. ముందుగా.. బోధన్ కు తీసుకువెళ్లి.. అక్కడ షకీల్ అమ్మ అంత్యక్రియలు పూర్తయిన తర్వాత.. పోలీస్ స్టేషన్ కు తరలించి.. అనంతరం అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.
అసలు షకీల్ ను పోలీసులు ఎందుకు చాలా కాలంగా అరెస్ట్ చేయాలని చూస్తున్నారు.. ఎందుకు షకీల్ దుబాయ్ లో ఉంటున్నారని ఆరా తీస్తే.. విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2023 డిసెంబర్ 23న రాత్రి.. సోమాజీగూడ సమీపంలోని ప్రజాభవన్(Praja Bhavan) దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదానికి, షకీల్ కు ఉన్న లింక్ బయటపడింది. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే.. అతి వేగంగా దూసుకొచ్చిన కారు.. ప్రజాభవన్ బారికేడ్లను (barricades) ఢీ కొట్టింది. ఈ ఘటనపై పంజాగుట్ట (Panjagutta)పోలీసులు.. అబ్దుల్ ఆసిఫ్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. కానీ.. సీసీ ఫూటేజ్ (CCTV) బయటికి వచ్చాక అసలు విషయం బయటపడింది. కారు నడిపింది.. మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ (MLA Shakeel’s son Sahil) కారు నడిపినట్టుగా స్పష్టంగా తెలిసొచ్చింది.
కారు నడిపింది షకీల్ కుమారుడు సాహిల్ అయితే.. ఆసిఫ్ పై కేసు ఎందుకు నమోదైందని ఆరా తీయగా.. సాహిల్ ను తప్పించేందుకే తన ఇంట్లో పనివాడైన ఆసిఫ్ ను దోషిని చేశారని తేలింది. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలతో.. అప్పట్లో పంజాగుట్ట ఇన్ స్పెక్టర్ పై సస్పెన్షన్ వేటు కూడా పడింది. ఆ తర్వాత.. ఈ ఘటనలో సాక్ష్యాలు తారుమారు చేశారన్నఅభియోగాలను మాజీ ఎమ్మెల్యే ఎదుర్కొన్నారు. పోలీసులు కూడా అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. కానీ.. అరెస్ట్ భయంతోనే షకీల్ చాలా కాలంగా దుబాయ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. చివరికి.. తల్లి అంత్యక్రియల కోసం హైదరాబాద్ రాగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలిసింది.
ఈ విషయంపై పోలీసులు అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.