బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై(Saif Ali Khan) దాడి చేసిన ప్రధాన నిందితుడు(Attacker) అరెస్టయిన విషయం తెలిసింది. ఈ రోజు ఉదయం థానేలో(Thane) అతడిని అదుపులోకి తీసుకున్నారు. ముంబై పోలీసులు(Mumbai police) సైఫ్ దాడి గురించి మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. “ఈ కేసులో అరెస్టయిన నిందితుడు బంగ్లాదేశీయుడు, పేరు మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షాజాద్, వయస్సు 30.
అతను అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించి, తన పేరు విజయ్ దాస్‌గా మార్చుకున్నాడు. కొన్ని నెలల క్రితం ముంబైకి వచ్చిన అతడు, కొద్ది రోజులు అక్కడ నుండి వెళ్లిపోయాడు. 15 రోజులు క్రితం ముంబైకి తిరిగి వచ్చి హౌస్ కీపింగ్ ఏజెన్సీలో పనిచేయడం ప్రారంభించాడు. దొంగతనం కోసం సైఫ్ ఇంట్లోకి ప్రవేశించి, సైఫ్ అడ్డు పడడంతో అతడిపై దాడి చేశాడు.”
సైఫ్‌పై దాడి చేసిన నిందితుడిని 72 గంటల తర్వాత అరెస్టు చేశారు. ముంబై పోలీసులు మరియు క్రైమ్ బ్రాంచ్ 30 బృందాలతో గాలింపు చేపట్టి, 100 మందికి పైగా అధికారులతో 15 నగరాల్లో నిందితుడిని వెతకగా, చివరకు థానేలో అరెస్టు చేశారు.
2025 జనవరి 16న సైఫ్ అలీఖాన్ ఇంట్లో ఓ దొంగ ప్రవేశించి, అతడిని కత్తితో గాయపరిచాడు. సైఫ్ శరీరంలో ఆరు చోట్ల గాయాలై, రెండు లోతుగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. శస్త్ర చికిత్స చేసి, శరీరంలోంచి 2.5 అంగుళాల కత్తిని తీసేశారు. ప్రస్తుతం సైఫ్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం..