దాయాది పాకిస్థాన్‌కు అండగా నిలిచిన టర్కీకి భారత్ గట్టి షాక్ ఇచ్చింది. యుద్ధ సమయంలో పాక్‌కు వంత పాడుతూ, భారత్‌పై తప్పుడు కథనాలు ప్రచారం చేసిందని టర్కీకి చెందిన ప్రముఖ న్యూస్ ఛానెల్ TRT వరల్డ్ ట్విటర్ ఖాతాను మన దేశంలో బ్లాక్ చేసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య టర్కీకి గట్టి హెచ్చరికలాంటింది.
ఇది మాత్రమే కాదు, టర్కీతో వాణిజ్య సంబంధాలు తెంచుకుంటున్నట్లు ఉదయపూర్ మార్బుల్స్ యూనియన్ సంచలన ప్రకటన చేసింది. ఆసియాలోనే అతిపెద్ద మార్బుల్స్ మార్కెట్‌గా పేరుగాంచిన ఉదయపూర్, టర్కీతో ఇకపై ఎలాంటి వ్యాపారం చేయబోమని తేల్చి చెప్పింది. పాకిస్థాన్‌కు మద్దతు ఇవ్వడం వల్ల టర్కీ ఆర్థికంగా కూడా నష్టపోవాల్సి వస్తుందని ఈ చర్యలు స్పష్టం చేస్తున్నాయి.
భారత్ తీసుకుంటున్న ఈ కఠినమైన చర్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి. ఒకవైపు పాకిస్థాన్‌కు మద్దతు ఇస్తూ, మరోవైపు భారత్‌తో మంచి సంబంధాలు కోరుకుంటున్న టర్కీకి ఇది పెద్ద దెబ్బే. భవిష్యత్తులో ఇరు దేశాల సంబంధాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి. కానీ ప్రస్తుతానికైతే, పాక్‌తో దోస్తీ చేస్తే భారత్ ఊరుకోదని టర్కీకి గట్టిగా అర్థమై ఉంటుంది.