మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా, కల్నల్ సోఫియా ఖురేషీపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. మహిళా సైనికాధికారిపై ఆయన చేసిన వ్యాఖ్యలు పలువురి మనోభావాలను దెబ్బతీశాయి. విమర్శలు వెల్లువెత్తడంతో, మంత్రి విజయ్ షా దిద్దుబాటు చర్యలకు దిగారు. “నా వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటేనన్ను క్షమించండి . కల్నల్ సోఫియా దేశానికి చేస్తున్న సేవలు అమోఘం. ఆమెను నేను గౌరవిస్తాను” అని ఆయన అన్నారు. కల్నల్ సోఫియా ఖురేషీ దేశానికి అందిస్తున్న సేవలను కొనియాడారు. కుల మతాలకు అతీతంగా ఆమె దేశానికి చేస్తున్న సేవలు ప్రశంసనీయమని తెలిపారు. తన వ్యాఖ్యలు దురుద్దేశపూర్వకంగా చేసినవి కావని, పొరపాటున దొర్లినవని ఆయన వివరణ ఇచ్చారు. అయితే, ఈ క్షమాపణలు వివాదాన్ని ఎంతవరకు చల్లారుస్తాయో వేచి చూడాలి.
Home National & International Minister Vijay Shah : వివాదంలో కల్నల్ సోఫియా ఖురేషీపై చేసిన మంత్రి విజయ్ షా...