జస్ ప్రీత్ బూమ్రా(Jasprit Bumrah). ఆయన బాల్ వేస్తున్నాడంటే ఎంతటి మహామహులైన బ్యాట్స్ మన్ అయినా అలర్ట్ అయిపోతారు. అరుదైన ఆ బౌలింగ్ స్టైల్ తో తెగ ఇబ్బంది పడుతుంటారు. ప్రపంచంలోని ఏ ఇతర బౌలర్ కు లేని రనప్ స్టైల్, బాల్ డెలివరీ స్టైల్.. బూమ్రా సొంతం. అదే ఆయన ప్రత్యేకం. ఈ విషయం గత ఏడాది జరిగిన టీ 20 వరల్డ్ కప్ లో అందరికీ తెలిసొచ్చింది. భారత జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన బూమ్రా.. తానేంటో, తన బౌలింగ్ లోని పదునేంటో ప్రపంచానికి మరోసారి ఆ టోర్నమెంట్ తో పరిచయం చేశాడు. అంతటి విలువైన ఆటగాడైన బూమ్రా.. ఇప్పుడు వరుస గాయాలతో కెరీర్ నే ప్రమాదంలో పడేసుకుంటున్నాడు. ఇప్పటికే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మొత్తానికి దూరమయ్యాడు. సమిష్టి కృషితో భారత జట్టు టైటిల్ గెలిచింది కానీ.. ఓడి