సినీ నటి సంబంధించి ప్రతి చిన్న విషయం సోషల్ మీడియాలో వైరల్ అవడం సాధారణం. ముఖ్యంగా తారల వ్యక్తిగత విషయాలు తెలుసుకోవడంలో నెటిజన్స్ ఆసక్తి చూపిస్తుంటారు. అలాగే, హీరోయిన్స్ గురించి రోజూ కొత్త రూమర్స్ చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా, ఓ హీరోయిన్ తనపై వచ్చిన రూమర్స్ పై క్లారిటీ ఇచ్చింది.
ఇటీవల, భారత క్రికెటర్ మహ్మద్ సిరాజ్(Mohmmad siraj) గురించి ప్రేమ రూమర్స్ సోషల్ మీడియాలో(Social media) తెగ హల్చల్ చేశాయి. సిరాజ్ బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఓ బ్యూటీతో ప్రేమలో ఉన్నాడని ప్రచారం నడుస్తోంది.
ఆమె ఎవరో కాదు, హిందీ బిగ్ బాస్(Biggboss) ఫేమ్ మహిరా శర్మ(Mahira Sharma). సిరాజ్ మరియు మహిరా మధ్య కొన్ని రోజులుగా డేటింగ్ జరుగుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని సిరాజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో మహిరా చేసిన పోస్టుకు లైక్ చేయడం, ఫాలో కావడం వల్ల బలపడ్డాయని కొన్ని ఆంగ్ల వెబ్సైట్లు పేర్కొన్నాయి.
ఈ రూమర్స్‌పై తాజాగా స్పందించిన మహిరా శర్మ, “నాకు ఎవరితోనూ డేటింగ్ చేసే విషయం లేదని” క్లారిటీ ఇచ్చింది. ఇంతకు ముందు కూడా తనకు సంబంధించిన అటువంటి రూమర్స్ వచ్చినట్లు వెల్లడించింది. అందువల్ల, ఆమె ఏమాత్రం కూడా ఈ రూమర్లను పట్టించుకోమని చెప్పింది. ఆమె తల్లి కూడా, “తన కుమార్తె సెలబ్రిటీ అయినందువల్ల ఎవరితోనైనా మాట్లాడితే ఇలాంటి రూమర్స్ వస్తూనే ఉంటాయ్” అని పేర్కొన్నారు.